జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను పలు పార్టీల ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌కు నిరసన సెగ తగిలింది. జాంబాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా అసదుద్దీన్ సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న అసదుద్దీన్‌పై స్థానికంగా ఉండే కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 10వేల రూపాయల వరద సాయం తమకు అందలేదని ఆయననున నిలదీశారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళల నిరసనతో అసదుద్దీన్ షాక్ తిన్నారు. వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక, గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ 52 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు అసదుద్దీన్ ఆదివారం స్పష్టం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో తమకు టీఆర్ఎస్తో పొత్తు లేదని ఒంటరిగానే బరిలో నిలిచామని చెప్పారు. చాలా చోట్ల టీఆర్ఎస్కు తమకు బలమైన పోటీ ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడితే కేంద్ర ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ హిందూత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
జీహెచ్ఎంసీతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పాతబస్తీ ప్రాంతంలో సత్తా చాటే ఎంఐఎం.. ఈ గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆ ప్రాంతంలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఈ మేరకు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అన్ని స్థానాలకు అభ్యర్థులను నిలపడం, బీజేపీ కూడా బలమైన ప్రచారంతో ముందుకు సాగుతుండటంతో పాతబస్తీలో ఎవరెన్ని సీట్లు సొంతం చేసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక, గ్రేటర్ ఎన్నికలు డిసెంబర్ 1 న జరగనుండగా 4 న ఫలితాలు వెలువడనున్నాయి.
GHMC Elections: ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ.. మహిళలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన అసదుద్దీన్
Sagar by poll Election: ‘నీలాంటి వాళ్లను చాలా మందిని చూసినం.. నిన్ను నీ నాయకులను తొక్కి పడేస్తం బిడ్డా..’ ఉద్యోగ నోటిఫికేషన్ లు అడిగినందుకు ఓ నిరుద్యోగికి మంత్రి జగదీశ్ రెడ్డి వార్నింగ్..
పాలిటిక్స్ : రేపు ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష, పోలీసుల అనుమతి
tirupati by poll: కత్తితో వచ్చినోడు కత్తితోనే పోతాడు. జగన్ కు దమ్ముంటే అలిపిరికి రావాలంటూ లోకేష్ సవాల్
Andhra Pradesh: ఆయనే బాగుంటే ఈ దుస్థితి వచ్చేదా? లోకేష్ తో తనది విడదీయని బంధమన్న అచ్చెన్న