GHMC Elections: బీజేపీ సోషల్ మీడియాను బలంగా ఢీ కొడుతున్న టీఆర్‌ఎస్.. ఎవరిది పైచేయి అంటే..

గ్రేటర్ ఎన్నికలు ప్రచారం రసవత్తరంగా మారింది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జరుగుతున్న ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను టీఆర్‌ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

news18-telugu
Updated: November 23, 2020, 12:04 PM IST
GHMC Elections: బీజేపీ సోషల్ మీడియాను బలంగా ఢీ కొడుతున్న టీఆర్‌ఎస్.. ఎవరిది పైచేయి అంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గ్రేటర్ ఎన్నికలు ప్రచారం రసవత్తరంగా మారింది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జరుగుతున్న ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను టీఆర్‌ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొంత కాలంగా గ్రేటర్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కేటీఆర్‌‌ ఈ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.మరోవైపు దుబ్బాక విజయంతో జోష్‌లో ఉన్న బీజేపీ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆశిస్తుంది. అయితే ఇరు పార్టీలు కూడా ప్రధానంగా సోషల్ మీడియాపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అనుకూల సోషల్ మీడియా చేసిన ప్రచారం తమను దెబ్బతీసిందని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిధుల వాటా ఎక్కువ ఉందని బీజేపీ చేసిన ప్రచారాన్ని జనాలు నమ్మారని అందుకే అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించాడని ఓ అంచనాకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న వాటిని జనాల దృష్టిలోకి తీసుకెళ్లడంలో టీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం విఫలమైందని గుర్తించాయి.

ఇక, జాతీయ స్థాయిలో బీజేపీ సోషల్ మీడియా ఎంత బలంగా ఉంటుందో అందరికి తెలసిందే. ఎన్నికల సందర్భంలో బీజేపీ సోషల్ మీడియా తట్టుకోలేక కాంగ్రెస్ సైతం చేతులేత్తిసన పరిస్థితి. అయితే అలాంటి బీజేపీ సోషల్ మీడియాను బలంగా ఢీ కొడితేనే గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించగలమని టీఆర్‌ఎస్ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ క్రమంలో గత ఎన్నికల సమయంలో తమను తీవ్రమైన ట్రోలింగ్‌ చేసిన బీజేపీ సోషల్ మీడియా విభాగంపై ప్రతిదాడికి సిద్దమైంది. గ్రేటర్ ఎన్నికల వేళ సరికొత్త వ్యుహంతో టీఆర్‌ఎస్ సోషల్ మీడియా ముందుకు సాగుతుంది. గతంలో బీజేపీ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చే టీఆర్‌ఎస్ సోషల్ మీడియా.. ఇప్పుడు వారిపై ఎదురుదాడికి దిగుతోంది. అలాగే బీజేపీ నేతల్లో ప్రసంగాల్లోని తప్పులను టార్గెట్‌గా చేసుకుని విరుచుకుపడుతుంది. అయితే ఈ పరిణామాలు బీజేపీ సోషల్ వింగ్‌కు మింగుడుపడటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్రాఫిక్ చలాన్లు గురించి చెప్పిన మాటలను టీఆర్ఎస్ శ్రేణులు విపరీతంగా ట్రోల్ చేశాయి. అలాగే సంజయ్ చేసే వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ తమకు అనుకూలంగా విమర్శలకు దిగుతున్నాయి. బీజేపీ నేతలపై అటాకింగ్ చేసే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ సోషల్ మీడియా ఆత్మరక్షణలో పడినట్టుగా తెలుస్తోంది. బీజేపీ నేతలపై ఓ చానల్ లోగోతో తప్పుడు ప్రచారం జరిగినప్పటికీ తక్షణ స్పందన లేకపోవడంతో నష్టం జరిగిపోయిందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. గతంలో బీజేపీ అటాకింగ్‌కు టీఆర్‌ఎస్ డిఫెన్స్‌లోకి వెళితే.. ఇప్పుడు టీఆర్‌ఎస్ అటాకింగ్‌కు బీజేపీ డిఫెన్స్‌లో వెళ్లిందని వాదనలు వినిపిస్తున్నాయి. మరి గ్రేటర్ "సోషల్" పోరులో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే ఫలితాలు వెలువడే దాకా వేచి చూడాల్సిందే.

మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణపై దృష్టి సారించడంతో బీజేపీ జాతీయ నాయకులు కొందరు గ్రేటర్ ప్రచారానికి రానున్నారు. అలాగే ప్రతి డివిజన్ బాధ్యతను పార్టీకి చెందిన ఒక్కో ముఖ్య నాయకుడికి అప్పగించినట్టు తెలుస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్ కూడా ఇప్పటికే అన్ని రకాలుగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. గ్రేటర్‌లోని అన్ని డివిజన్లు కవర్ చేసేలా శనివారం నుంచే కేటీఆర్ రోడ్డు షో ప్రారంభించారు. ఇక, డిసెంబర్ 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.
Published by: Sumanth Kanukula
First published: November 23, 2020, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading