GHMC Elections: టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల.. కవితకు దక్కని చోటు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మొత్తం 10 మందిని ఆ జాబితాలో చేర్చింది.

news18-telugu
Updated: November 20, 2020, 6:46 PM IST
GHMC Elections: టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల.. కవితకు దక్కని చోటు
కల్వకుంట్ల కవిత(ఫైల్ ఫోటో)
  • Share this:
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మొత్తం 10 మందిని ఆ జాబితాలో చేర్చింది. ఇందుకు సంబంధించిన లిస్ట్‌ను ఎన్నికల సంఘానికి అందజేసింది. వారికి స్టార్ క్యాంపెయినర్స్ పాస్‌లు జారీ చేయాలని కోరింది. అయితే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చోటు లభించలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి చాలా యాక్టివ్‌గా వ్యవహరిస్తున్న కవితకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు దక్కకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రేటర్‌లో పలువురు టీఆర్‌ఎస్ అభ్యర్థలు నామినేషన్ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. అయితే స్టార్ క్యాంపెయినర్స్ జాబితా సీఎంతో పాటు కేవలం మంత్రులకు మాత్రమే చోటు కల్పించడంతో.. ఆ జాబితాలో కవితకు చోటు దక్కలేదని పలువురు అంటున్నారు. ఇక, ఇద్దరు మహిళా మంత్రులు.. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో ఉన్నారు.

టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్స్ జాబితా..

1. కేసీఆర్(ముఖ్యమంత్రి)
2. కేటీఆర్(టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్)
3. హరీష్ రావు(మినిస్టర్)
4. మహమూద్ అలీ(మినిస్టర్)
5. ఈటల రాజేందర్(మినిస్టర్)

6. తలసాని శ్రీనివాస్ యాదవ్(మినిస్టర్)
7. కొప్పుల ఈశ్వర్(మినిస్టర్)
8. సబితా ఇంద్రారెడ్డి(మినిస్టర్)
9. పువ్వాడ అజయ్(మినిస్టర్)
10. సత్యవతి రాథోడ్(మినిస్టర్)

ఇక, గ్రేటర్‌లో నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. టీఆర్‌ఎస్ పార్టీ మొత్తం 150 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపింది. తొలి జాబితాలో 105 స్థానాలకు అభ్యర్థులను, రెండో జాబితాలో 20 స్థానాలకు అభ్యర్థులను , తుది జాబితాలో మిగిలిన 25 స్థానాలకు అభ్యర్థులను టీఆర్‌ఎస్ ప్రకటించింది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 85 డివిజన్లలో మహిళా అభ్యర్థులకు టికెట్లు కేటాయించామని చెప్పారు. హైదరబాద్ అభివృద్ధిపై ఆయన ప్రగతి నివేదికను విడుదల చేశారు.
Published by: Sumanth Kanukula
First published: November 20, 2020, 6:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading