GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ప్రకటన

గ్రేటర్ ఎన్నికల్లో బ్యాలెట్ పద్దతిన పోలింగ్ నిర్వహించవద్దని బీజేపీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఈవీఎంల పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించాలని కోరారు.

news18-telugu
Updated: October 5, 2020, 4:49 PM IST
GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ప్రకటన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (GHMC) ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఈసారి ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గుర్తింపు పొందిన పార్టీల నుంచి ఎన్నికల సంఘం అభిప్రాయాలను సేకరించింది. ఐతే గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానం ద్వారానే నిర్వ‌హించాల‌ని మెజార్టీ రాజ‌కీయ పార్టీలు కోరాయి. రాష్ట్రంలో గుర్తింపు పొందిన, న‌మోదైన‌ 50 పార్టీల్లో 26 పార్టీలు త‌మ అభిప్రాయాల‌ను ఎన్నికల సంఘానికి తెలిపాయి. ఈవీఎంల ద్వారా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని 3 పార్టీలు మాత్రమే కోరాయి. అందులో బీజేపీ కూడా ఉంది.

మరో 13 పార్టీలు మాత్రం బ్యాలెట్ విధానానికి జైకొట్టాయి. ఈవీఎంల ద్వారా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందని.. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించడం శ్రేయస్కరమని చెప్పాయి. ఇక మిగిలిన పార్టీలు మాత్రం ఏదైనా ఓకేనని తెలిపాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ పార్టీ అభిప్రాయం మేరకు.. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తామని వెల్లడించింది.

జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం 2021 ఫిబ్రవరి 10వ తేదీతో పూర్తవుతున్నది. ఆ లోపు ఎన్నికలను నిర్వహించి.. కొత్త పాలకమండలిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లను మొదలుపెట్టింది. కరోనా నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. గతంలో 120 0మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుచేయగా, ఈసారి 800 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈసారి పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 10 వేలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో బ్యాలెట్ పద్దతిన పోలింగ్ నిర్వహించవద్దని బీజేపీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఈవీఎంల పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించాలని కోరారు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తే అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశముందని అభిప్రాయపడింది. టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై పాతబస్తీలోనూ ఎంఐఎం పార్టీ రిగ్గింగ్ పాల్పడవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈవీఎంలనే వినియోగించాలని కోరింది. కానీ చాలా పార్టీలు బ్యాలెట్ పద్దతికే మొగ్గు చూపడంతో.. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహస్తామని ఎన్నికలం సంఘం తెలిపింది.
Published by: Shiva Kumar Addula
First published: October 5, 2020, 4:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading