GHMC Elections: గ్రేటర్ పోరు.. 90 మందితో తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ.. అభ్యర్థులు వీరే

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బరిలో దిగనున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ గురువారం ఆ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

news18-telugu
Updated: November 19, 2020, 10:42 PM IST
GHMC Elections: గ్రేటర్ పోరు.. 90 మందితో తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ.. అభ్యర్థులు వీరే
టీడీపీ
  • Share this:
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బరిలో దిగనున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలతో నగరంలో పుంజుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ గురువారం ఆ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 90 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి పట్టున్న స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు తెలంగాణ టీడీపీ నేతలు విస్తృత చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలి జాబితాలో 90 స్థానాలకు అభ్యర్థులను టీడీపీ మొత్తం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో మాత్రమ స్పష్టం చేయలేదు. అది తెలియాలంటే శుక్రవారం నామినేషన్ల గడువు పూర్తయేవరకు వేచిచూడాల్సిందే. మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై టీటీడీపీ ముఖ్య నాయకులు ఎన్టీఆర్ భవన్‌లో సమావేశమై చర్చలు జరిపారు.

అయితే గ్రేటర్‌లో టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ముఖ్య నేతలు వస్తారా, లేరా అనే సందేహాం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరపున నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌లు ప్రచారం చేశారు. అయితే ఈ సారి వీరు గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా ? లేదా ఎన్నికలకు దూరంగా ఉంటారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

టీడీపీ అభ్యర్థుల జాబితా..
GHMC Elections 2020, GHMC Elections, TDP Releases First List Of Candidates, TDP Releases First List, TDP In GHMC Elections, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, టీడీపీ, టీడీపీ ఫస్ట్ లిస్ట్ GHMC Elections 2020, GHMC Elections, TDP Releases First List Of Candidates, TDP Releases First List, TDP In GHMC Elections, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, టీడీపీ, టీడీపీ ఫస్ట్ లిస్ట్ GHMC Elections 2020, GHMC Elections, TDP Releases First List Of Candidates, TDP Releases First List, TDP In GHMC Elections, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, టీడీపీ, టీడీపీ ఫస్ట్ లిస్ట్


ఇక, గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులతో పాటు, స్వతంత్రులుగా పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల తేదీ కూడా దగ్గర్లోనే ఉండటంతో ప్రధాన పార్టీలన్ని ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి.
Published by: Sumanth Kanukula
First published: November 19, 2020, 10:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading