Home /News /politics /

GHMC ELECTIONS MINISTER HARISH RAO FIRES ON BJP AND CONGRESS SU

GHMC Elections: అబద్ధాల పునాదుల మీద ఎదగాలని అనుకుంటున్నారు.. బీజేపీ‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ హరీశ్‌రావు

టీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

టీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

బీజేపీపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి ఒకప్పుడు సిద్ధాంతం ఉండేదని.. నేడు ఆ పార్టీ అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారిందని విమర్శించారు.

    బీజేపీపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి ఒకప్పుడు సిద్ధాంతం ఉండేదని.. నేడు ఆ పార్టీ అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారిందని విమర్శించారు. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలనుకుంటుందని ఆరోపించారు. బీజేపీ వ్యవహార శైలిని టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చేస్తాయని.. కానీ ఆ పార్టీలు ఏం చేశాయని ఓట్లేయాలని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ప్రజల్లో ఉన్నది తామేనని చెప్పారు. బిహార్ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని.. మరి తెలంగాణకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వరా అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పఠాన్‌ చెరులో నిర్వహించిన టీఆర్‌ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త‌ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, ఫారూఖ్ హూస్సెన్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్,‌అటవీ అభివృద్ధి ‌సంస్థ ఛైర్మన్ ఒంటేరు‌ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

    70 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో పఠాన్‌చెరువుకు కనీసం మంచి నీళ్లు ఇవ్వలేదని చెప్పారు. ఆడబిడ్డలు నీటి ట్యాంకర్ల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి ఉండేదన్నారు.
    ఎన్నికల్లో మంచి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చిను టీఆర్ఎస్.. రూ. 251 కోట్లతో ఇంటింటికి తాగునీరు అందజేసిందని చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లకు పని లేకుండా పోయిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కోతలు లేని నాణ్యమైన విద్యుత్ ఇంటింటికి ఇచ్చి జనరేటర్లు, కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, డిజీల్ ఖర్చు లేకుండా చేసిందన్నారు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ.. "తెలంగాణ ఇస్తే‌ రాష్ట్రం చీకటిగా మారుతుందని ఆనాడు కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. కానీ జరిగిందేమిటి... కాంగ్రెస్ నేతల జీవితాల్లో చీకటి, ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో‌ పఠాన్ చెరులో‌ వారంలో మూడు‌ రోజులు పరిశ్రమల్లో పవర్ హాలీడెస్ ఉండేవి. చాలా వరకు పరిశ్రమలు మూతపడ్డాయి. కానీ టీఆర్‌ఎస్ ‌గెలిచాక 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాతో కొత్త పరిశ్రమలు పఠాన్ చెరుకు వస్తున్నాయి. కార్మికులకు ఒటీలు వస్తున్నాయి. పఠాన్ చెరులో‌ ఇండస్ట్రియల్ పార్క్, ‌సుల్తాన్ పూర్‌లో మెడికల్‌ డివైస్‌ పార్కు, ఉస్మాన్ నగర్ లో 250 ఎకరాల్లో ఐటీ‌పార్కు,‌ శివానగర్ లో ఎల్ఈడీ పార్క్ వస్తున్నాయి. వేలాదిమంది యువతకు కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి.

    చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పటాన్ ‌చెరు‌భూములు అమ్మారు.. తప్ప ఒక మార్కెట్ కట్టించలేదు. కానీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రూ. 180‌ కోట్ల‌ విలువైన భూమిలో 15 ఎకరాలలో పది కోట్లతో ‌మంచి‌ మార్కెట్ కట్టడం జరిగింది. పఠాన్ చెరులో‌ స్టేడియం, ప్రతి డివిజన్‌లో ఫంక్షన్ హాలు,‌ ఆడపిల్లల‌ పాఠశాల‌ కూలిపోతే‌ 2 కోట్లతో‌ భవనం, చిన్న‌వాగి, పెద్ద‌వాగులపై ‌16 బ్రిడ్జ్‌లు నిర్మాణం చేయడం‌ జరిగింది. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లలో పది శాతం అంటే‌‌ నాలుగు వేల ఇళ్లు పఠాన్‌ చెరు‌‌ పేదలకు దక్కనున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు‌ అసలు‌ ఓటు‌ ఎందుకు వేయాలి?. ఎన్నికలలో గెలిస్తే‌ వేయి రూపాయల ‌పెన్షన్‌ను రెండు‌ వేలు‌ చేస్తామని మాట ఇచ్చి,‌ ఎన్నికల్లో గెలవగానే మాట‌నిలబెట్టుకున్న ‌ముఖ్యమంత్రి‌ కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలో‌‌ ఉండి‌‌ చేసిందేమి‌ లేదు. ఇవాళ‌ అధికారం లేని కాంగ్రెస్ చేసేదేమి లేదు. కరోనా కష్ట కాలంలో‌ బీజేపీ, కాంగ్రెస్ నేతలు భయపడి ఇళ్లలో ఉండి బయటకే రాలేదు. కానీ మేం కరోనా బాధితుల‌ తలుపు తట్టి మందులు, వైద్యసేవలు అందేలా‌ చూశాం. ఆ రెండు పార్టీల్లా ప్రజలు కష్టాల్లో ఉంటే ఇంట్లో కూర్చోలేదు. ప్రజలకు‌ అండగా ఉన్నాం. బీజేపీ కరోనాతో కూడా‌ రాజకీయాలు చేస్తోంది.

    బీహార్ ఎన్నికలలో గెలవడానికి గెలిస్తే బీహార్ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ ప్రచారం చేసింది. తెలంగాకు‌ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వరా.. ? హైదరాబాదు ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వరా.. ?. బీజేపీది దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ ఏం చేసింది.. ? బీజేపీ ఎం చేసింది. ? అనే విషయాలు , తెరాస గెలిచాక చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెరాస కార్యకర్తలు గడప, గడపకు ,గుండె, గుండెకు తీసుకెళ్లాలి. జీవో 58, 59‌ కింద ఉచితంగా పఠాన్ చెరులో పేద ప్రజలకు పట్టాలిచ్చాం. సీఎం కేసీఆర్ కరోనాను దృష్టిలో పెట్టుకుని ఆస్తి పన్నును 50, శాతం తగ్గించి ఊరట నిచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలు గడప గడపకు తీసుకెళ్లాలి. సోషల్ మీడియా లోనూ ప్రచారం ‌చేస్తూ కాంగ్రెస్, బీజేపీల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి" అని తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Harish Rao, Hyderabad - GHMC Elections 2020, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు