GHMC Elections: మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్.. డిసెంబర్ 6న ఎన్నికలు?
ఏప్రిల్ 30న లింగోజిగూడ డివిజన్‌కు ఉప ఎన్నిక జరగగా.. నేడు ఫలితం వెల్లడైంది. (ప్రతీకాత్మక చిత్రం)
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీ.పార్థసారధి ఈ రోజు ఉదయం 10.30 నిమిషాలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను ఆయన విడుదల చేసే అవకాశం ఉంది.
గ్రేటర్ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. తెలంగాణలో తామే నంబర్.1 అని చాటాలని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. సీఎం సొంత జిల్లాలోని దుబ్బాకలో ఓటమి అనంతరం ఆ పార్టీ ఈ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది. మరో వైపు దుబ్బాకలో మాదిరిగానే జీహెచ్ఎంసీలోనూ టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. వివిధ పార్టీల్లో బలమున్న నేతలు, అసంతృప్తులను గుర్తించి వారికి కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ నేతలు ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక సవాల్ గా మారింది. ఈ ఎన్నికలో మంచి ఫలితాలు రాకపోతే ఆ పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సైతం గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.
ఇదిలా ఉంటే.. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీ.పార్థసారధి ఈ రోజు ఉదయం 10.30 నిమిషాలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను ఆయన విడుదల చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 6న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ప్రచురితమైంది. ఆ రోజు సెలవు రోజు కావడంతో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సైతం సానుకూలత వ్యక్తం చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. సాధారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతూ ఉంటుంది.
సెలవు రోజున ఎన్నికలు నిర్వహిస్తే ఎక్కువ మంది పోలింగ్ కు హాజరయ్యే అవకాశం ఉందని ఎస్ఈసీతో పాటు ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని ముగించాలి. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న డిసెంబరు 6న పోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలయ్యే తేదీకి ఎన్నికలకు మధ్య గడువు తప్పనిసరిగా 15 రోజులు ఉండాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.