news18-telugu
Updated: November 22, 2020, 2:54 PM IST
కేసీఆర్, కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
హైదరాబాద్‌తో బీజేపీకి విడదీయలేని బంధం ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేదని అన్నారు. నగరానికి మెట్రో కేసీఆర్ తెచ్చింది కాదని.. మెట్రోను పనులను అడ్డుకున్నది కేసీఆర్ అని విమర్శించారు. ట్యాంక్ బండ్ ప్రక్షాళన ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ది కోసం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. బీజేపీకి మేయర్ పీఠం దక్కితే.. హైదరబాద్‌లో అవినీతిని తగ్గించి ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం కిషన్‌రెడ్డి మీట్ ది ప్రెస్‌లో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. "2016లో టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో ఓటేస్తే డబల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పింది. ఐదేళ్లు అయినా ఇళ్లు ఇవ్వలేదు. ఏ నియోజకవర్గంలో కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. హైదరాబాద్ ను ఇస్తాంబుల్... డల్లాస్ చేస్తా అన్నారు. నేడు హైదరాబాద్ చెరువు లా మారింది... పడవల్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. మీరు చెప్పిన హామీ ఏమైంది?. వర్షపు నీరు ఆగకుండా చేసే శక్తి మీకులేదా?. నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏమయ్యాయి?. ఉన్న ఆసుపత్రికే తాలాలు వేసారు. మెట్రో కేసీఆర్ తెచ్చింది కాదు.. వాళ్లు మెట్రో పనులను అడ్డుకున్నారు. టీఆర్ఎస్... ఎంఐఎం లు ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా అడ్డుకున్నారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ కోసం గత ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఎంఎంటీఎస్‌ను కూడా అడ్డుకున్నారు.
ట్యాంక్ బండ్ ప్రక్షాళన చేస్తా అన్నారు.. ఇప్పటికీ అది జరగలేదు. ట్విన్ టవర్స్ ఎటుపోయాయి. గాంధీనగర్ తరహాలో మూసీ పరిసరాలను తయారు చేస్తా అన్నారు. కానీ ఎందుకు మూసీ ప్రక్షాళన జరగలేదు?. ప్రస్తుతం మూసీ కబ్జా ల పాలవుతోంది. మాటలలో బ్రాండ్ ఇమేజ్ పెంచి.. మురికి నగరాన్ని ముంచారు. బీజేపీ అభ్యర్థిని మేయర్‌గా చేస్తే అవినీతి తగ్గించి ప్రజల మౌళిక వసతుల కోసం కృషి చేస్తాం. అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. టీఆర్ఎస్ నేతలు ప్రజలను ఒప్పించలేకపోతున్నారు కాబట్టి తాయిలాలతో ఓట్లు తెచ్చుకోవాలనుకుంటున్నారు.
పైసలతో.. హోర్డింగ్ లతో.. అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు. ఒక్క హోర్డింగ్ అడిగినా ఏ కంపెనీ ఇవ్వడం లేదు. కంపెనీలు కూడా మాకు అధికారులు ఆదేశాలు ఇచ్చారు.. మీకు ఇవ్వలేమంటున్నారు. ఎన్నికల సందర్భంగా పుట్ పాత్ లపై భారీ హోర్డింగ్ లు పెట్టారు. ఇదేమైనా ప్రైవేట్ కంపెనీనా?. హైదరాబాద్ రెండు కుటుంబాల చేతుల్లో బలి అవుతోంది. రెండు కుటుంబాల చేతుల్లో ఉండాలని తెలంగాణ తెచ్చుకోలేదు. కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను అధికార పార్టీ నేతలు కబ్జా పెట్టారని ఫిర్యాదులు మాకు అందుతున్నాయి. హైదరాబాద్‌ను ఆలోచన విధానంతో ఓ అద్బుతమైన నగరం గా తీర్చిదిద్దుతాం. టీఆర్ఎస్ చెప్పిన డంపింగ్ యార్డ్ లు..మార్కెట్.. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏమయ్యాయి?. నగరంలోని అనేక స్టేడియాలలో మెయింటైన్ చేయడం లేదు"అని అన్నారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 22, 2020, 2:54 PM IST