GHMC ELECTIONS EXIT POLLS INTELLIGENCE SURVEY SAYS TRS MAY GET 75 SEATS BA
GHMC Election Results: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఇంటెలిజెన్స్ సర్వే..సీఎం కేసీఆర్ ముందు రిపోర్ట్?
ప్రతీకాత్మక చిత్రం
Intelligence Survey on GHMC Elections: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఓ సర్వే నిర్వహించిందని, ఆ నివేదిక సారాంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించినట్టు తెలిసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేపు (డిసెంబర్ 4) వెలువడనున్నాయి. ఈ క్రమంలో పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు వచ్చాయి. వాటిలో మెజారిటీ సర్వేలు అధికార టీఆర్ఎస్ పార్టీనే మరోసారి గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురుతుందని స్పష్టం చేస్తున్నాయి. అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఓ సర్వే నిర్వహించిందని, ఆ నివేదిక సారాంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించినట్టు తెలిసింది. ఆ నివేదిక ప్రకారం మరోసారి కారు టాప్ స్పీడ్‌లో దూసుకుపోతుందని అంచనా వేసింది. అయితే, 2016 ఎన్నికల్లో వచ్చినట్టుగా 99 రాకపోవచ్చని అంచనాలో పేర్కొంది. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం అత్యధికంగా టీఆర్ఎస్ 75, బీజేపీ 26, ఎంఐఎం 40, కాంగ్రెస్ 6 చోట్ల గెలవొచ్చని, రెండు సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని లెక్క వేసింది. మొత్తం 149 డివిజన్లకు సంబంధించి ఈ రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. రీ పోలింగ్ జరిగిన ఓల్డ్ మలక్ పేటకు సంబంధించిన సమాచారం ఇందులో లేదు.
ఇంటెలిజెన్స్ సర్వే
టీఆర్ఎస్ 68 - 75
బీజేపీ 18 - 25
ఎంఐఎం 36 - 40
కాంగ్రెస్ 5-8
పీపుల్స్ పల్స్
టీఆర్ఎస్ - 68-78
బీజేపీ - 25 - 35
ఎంఐఎం - 38-42
కాంగ్రెస్ - 1-5
ఇతరులు - 0
జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లకు జరిగిన పోలింగ్‌లో సుమారు 46.6 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2016తో పోలిస్తే కొంచెం ఎక్కువ. డిసెంబర్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేశారు. ఒక హాల్ కి 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం 8152 మంది కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. 31 మంది కౌంటింగ్ పరిశీలకులు ఉంటారు. కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సీసీ టీవీలు ఏర్పాటు అయ్యాయి. ఒక రౌండ్ కి 14000 ఓట్లు లెక్కింపు జరగనుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావాలి. బ్యాలెట్ పత్రాలను లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.