Hyderabad Municipal Elections 2020: మోండా మార్కెట్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. మోండా మార్కెట్ అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ ప్రస్థానానికి పునాది. అక్కడి నుంచే పోటీ చేసి గెలిచిన ఆయన మెల్లగా రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగారు. అలాంటి చోట బీజేపీ జెండా ఎగరేసింది.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు కంచుకోట లాంటి మోండా మార్కెట్లో కాషాయ జెండా ఎగిరింది. మోండా మార్కెట్ అంటే తలసాని రాజకీయ ప్రస్థానానికి పునాది. అక్కడి నుంచే పోటీ చేసి గెలిచిన ఆయన మెల్లగా రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగారు. అలాంటి చోట బీజేపీ జెండా ఎగరేసింది. బీజేపీ అభ్యర్థి కొంతం దీపిక విజయం సాధించారు. ఇక్కడ కేవలం నలుగురు మాత్రమే పోటీ చేశారు బీజేపీ నుంచి దీపిక, టీఆర్ఎస్ తరఫున ఆకుల పుష్ప, టీడీపీ నుంచి సాయిరాణి, కాంగ్రెస్ తరఫున బాలా ప్రశాంతి పోటీలో ఉన్నారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. ఓ రకంగా ఆయనకు కూడా షాక్ తగిలినట్టే. 2016లో ఆకుల పుష్ప ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆమెపై బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. గతం కంటే చాలా సీట్లు తక్కువగా వస్తున్నాయి. ఇక బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. దాదాపు 40 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లోనూ కమలం వికసిస్తోంది. ఈ క్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హబ్సిగూడ డివిజన్లో భార్య స్వప్న ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి చేతన చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో స్వప్న విజయం సాధించగా.. ఈసారి మాత్రం ఓడిపోక తప్పలేదు. హబ్సిగూడ డివిజన్ ఉప్పల్, ఎల్బీనగర్ నియోజక పరిధిలోకి వస్తుంది. డివిజన్ను మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ డివిజన్లో 49,007 మంది ఓటర్లున్నారు. ఇందులో 25,401 పురుషులు, 23,605 పురుషులు, 50 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.