GHMC Elections: సోనియా గాంధీ ఆశీస్సులతోనే బీజేపీలోకి.. సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

news18-telugu
Updated: November 21, 2020, 5:52 PM IST
GHMC Elections: సోనియా గాంధీ ఆశీస్సులతోనే బీజేపీలోకి.. సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
సర్వే సత్యనారాయణ(ఫైల్ పొటో)
  • Share this:
జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలోనే తాను బీజేపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశీస్సులతోనే బీజేపీలో వెళ్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ కోవర్టుల వల్లే పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనమైందని ఆరోపించారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని నియమించింది ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. కాంగ్రెస్ పతనానికి రాష్ట్ర నాయకత్వమే కారణమని.. తనలాంటి నేతలను వారు గౌరవించడం లేదని విమర్శించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీని ఒప్పించింది తానేనని సర్వే సత్యనారాయణ అన్నారు. సోనియా గాంధీ తనకు తల్లి అని, రాహుల్ గాంధీ తమ్ముడని అన్నారు. సోనియా ఆరోగ్యం క్షీణించిందని, రాహుల్‌కు రాజకీయాలపై ఆసక్తి లేదని అందుకే తాను మరోదారి చూసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. దేశంలో మరో 20 ఏళ్లు బీజేపీదే అధికారమని జోస్యం చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని అన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల హడావుడి ప్రారంభం అయినప్పటీ నుంచి గ్రేటర్ పరిధిలోని పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సర్వే కూడా బీజేపీలో వెళుతున్నారు.

ఇంకా కొందరు నేతలు కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన దానిని ఖండించారు. మరోవైపు పలు డివిజన్లలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
Published by: Sumanth Kanukula
First published: November 21, 2020, 5:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading