news18-telugu
Updated: November 22, 2020, 10:58 AM IST
ఫ్రతీకాత్మక చిత్రం
జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారం, పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసాధించాయి. ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్ల నియమాకంపై అన్ని పార్టీలు ప్రత్యేక కసరత్తు చేస్తున్నాయి. ఇక, ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు దాదాపు 50 వార్డ్స్ ఉన్న పాతబస్తీ కీలకం కానుంది. అయితే అక్కడ ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ మినహా మిగతా పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ మూడు పార్టీలకు మినహా, మిగిలిన పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు పాతబస్తీలోని కొన్ని వార్డుల్లో పోలింగ్ ఎజెంట్స్ దొరకడం కష్టంగా మారిందని సమాచారం. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక, పోలింగ్ ఏజెంట్లపై ప్రతి పార్టీ ఆధారపడి పనిచేస్తోంది. పోలింగ్ జరిగే రోజున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తరఫున అన్ని తామై వ్యవహరించాల్సి వస్తోంది. పోలింగ్ మొదలైనప్పటి నుంచి బ్యాలెట్ బాక్స్‌లు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.అందుకే పోలింగ్ ఏజెంట్ల నియమాకంలో ప్రధాన రాజకీయ పార్టీలన్ని నమ్మకస్తులన్నీ, పరిస్థితులు ఎదుర్కొనే వారిని ఎంపిక చేసుకుంటూ ఉంటారు.
ఇక, పాతబస్తీ విషయానికి వస్తే అక్కడ చాలా కాలంగా ఎంఐఎం సత్తా చాటుతూ వస్తోంది. ప్రతి ఎన్నికల్లో పాతబస్తీల్లో ఆ పార్టీదే హవా సాగుతుంది. అందుకే అక్కడ ఎంఐఎంకు బలమైన పోలింగ్ ఎజెంట్లు దొరుకుతారు. ఇక, బీజీపీ కూడా పాతబస్తీలో విజయం సాధించాలని బలంగా కోరుకుంటుంది. కేవలం మున్సిపల్ ఎన్నికలే కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ తమ ఖాతాలో వేసుకుంది. అంతకుముందు కూడా పాతబస్తీలోని పలు నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్థులు గెలుపొందిన సంగతి తెలిసిందే. పాతబస్తీలో ఎంతో కొంత పట్టు ఉన్న బీజేపీ.. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో మరింత దూకుడుగా వ్వవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి పాతబస్తీలో బలమైన పోలింగ్ ఏజెంట్లను ఉంచగలుతుంది.
గతంలో ఎంఐఎంతో స్నేహపూర్వకంగా కొనసాగిన టీఆర్ఎస్ పార్టీ.. ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాల నుంచి తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. అయితే పాతబస్తీలో పోలింగ్ ఏజెంట్లు దొరకడం ఆ పార్టీకి అంతా కష్టమేమి కాకపోవచ్చు. కాకపోతే కొన్ని వార్డుల్లో మాత్రం ఎంతవరకు ఎఫెక్టివ్ పోలింగ్ ఏజెంట్స్ దొరుకుతారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇక, అసలు చిక్కంతా కాంగ్రెస్, మజ్లీస్ బచావో తహ్రీక్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులకే వచ్చింది. ఈ ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపని వారికి కొన్ని వార్డుల్లో పోలింగ్ ఏజెంట్ల దొరకడం ఇబ్బందికరంగా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో పోలింగ్ ఏజెంట్లుగా చేసేందుకు ఎవరైనా ముందుకొచ్చినా.. వారికి పక్కవారి నుంచే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం కూడా ఉంది.
Published by:
Sumanth Kanukula
First published:
November 22, 2020, 10:56 AM IST