Ghmc Elections: గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మిగిలేవి అవే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: November 19, 2020, 3:24 PM IST
Ghmc Elections: గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మిగిలేవి అవే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బండి సంజయ్(ఫైల్ ఫోటో)
  • Share this:
జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై కేసీఆర్ చేసిన‌ వ్యాఖ్యలు దారుణమని మండిపడ్డారు. ప్రపంచంలో భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టిన ప్రధాని మోదీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మోదీపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ అంత దుర్మార్గపు సీఎం ఎక్కడా లేడని.. రాష్ట్ర ప్రజలు ఆయనను చూసి సిగ్గు పడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు బార్లు, వైన్సే మిగులుతాయని తీవ్రస్థాయితో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు కేసీఆర్‌కు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. ఎవరి ఓట్ల కోసం దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ కుల అహంకారం ఎక్కువని విమర్శించారు. ఎంఐఎం ఉగ్రవాద సంస్థ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను ఎంఐఎం చేతుల్లో పెట్టాలని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని.. అందుకే ఫ్రంట్‌ల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్తే ఆయనను ఎవరూ పట్టించుకోరని అన్నారు.

ఇక, బీజేపీ వరద సాయాన్ని ఆపిందంటూ టీఆర్‌ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని బండి సంజయ్ అన్నారు. తన సంతకం ఫోర్జరీ చేసి లేఖ విడుదల చేశారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేనతో ఎలాంటి పొత్తు లేదని ఆయన స్పష్టం చేశారు.
Published by: Sumanth Kanukula
First published: November 19, 2020, 3:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading