GHMC ELECTIONS 2020 YOU CAN VOTE IN HYDERABAD BY SHOWING ONE OF THESE 19 IDENTITY CARDS SK
GHMC Elections: ఓటర్ ఐడీ లేదా? ఓటు వేసేందుకు వీటీలో ఏది ఉన్నా ఓకే
ప్రతీకాత్మక చిత్రం
GHMC Elections 2020: 'మై జీహెచ్ఎంసీ (My GHMC)' యాప్‌లో నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్లో క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్‌తో పాటు పోలింగ్ బూత్ ఎక్కడవుందో గూగుల్ (Google) మ్యాప్ లొకేషన్ వస్తుంది.
జీహెచ్ఎంసీలో ప్రచారం ముగిసింది. మంగళవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రజలలో పలు అనుమానాలు నెలకొన్నాయి. ఓటు వేసేందుకు ఓటర్ ఐడీ ఖచ్చితంగా ఉండాలా..? లేని వారు ఏం చెయ్యాలి? అని అడుగుతున్న వేళ.. వీరి ప్రశ్నలకు ఎన్నికల సంఘం క్లారటీ ఇచ్చింది. ఓటర్ జాబితాలో పేరున్న వారంతా.. ఓటర్ ఐడీ అందుబాటులో లేకున్నా ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డులయినా చూపాలని లేదంటే..ఈ కింద తెలిపిన 18 ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదయినా ఒకదానిని చూపాలని జిల్లా ఎన్నికల అధికారి డి.ఎస్. లోకేష్ కుమార్ వెల్లడించారు.
ఓటర్ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు:
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేవారు తమ ఓటరు స్లిప్‌ను పొందడంతో పాటు మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్ మ్యాప్ కూడా వచ్చే యాప్‌ను జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా రూపొందించింది. ఇప్పటికే నగరంలోని ఓటర్లకు ఓటరు స్లిప్‌లను పంపిణిని జీహెచ్ఎంసీ చేపట్టింది. అయితే, నగర ఓటర్లలో అధిక శాతం మందికి మొబైల్ ఫోన్లు ఉండడం వల్ల అర చేతిలోనే ఓటరు పోలింగ్ బూత్, ఓటర్ స్లిప్‌ను డౌన్ లోడ్ చేసుకునే విధంగా ఈ మొబైల్ యాప్‌ను రూపొందించింది.
'మై జీహెచ్ఎంసీ (My GHMC)' యాప్‌లో నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్లో క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్‌తో పాటు పోలింగ్ బూత్ ఎక్కడవుందో గూగుల్ మ్యాప్ లొకేషన్ వస్తుంది. పేరుకు బదులుగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేర్లు ఎంటర్ చేసినా ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం గూగుల్ మ్యాప్ వస్తుంది. ఈ నో-యువర్ పోలింగ్ స్టేషన్ యాప్‌పై చైతన్యం కలిగించేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. బస్ షెల్టర్ లపైనా ఫ్లెక్సీయేలను ఏర్పాటు చేయడం, ఎఫ్.ఎం. రేడియోలలో జింగిల్స్ ప్రసారం, టెలివిజన్ చానెళ్లలో స్క్రోలింగ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే, ఈ యాప్‌పై స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకు వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.