GHMC Elections: 10వేలు కాదు..రూ.20 వేలు.. వరద బాధితులకు బీజేపీ హామీ

GHMC Elections: వరద మునిగి పాడయిన కార్లు, బైక్‌లు స్థానంలో కొత్తవి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్. ఇళ్లు కూలిపోయిన వారికి కొత్త ఇల్లు కట్టిస్తామని వెల్లడించారు.

news18-telugu
Updated: November 19, 2020, 2:35 PM IST
GHMC Elections: 10వేలు కాదు..రూ.20 వేలు.. వరద బాధితులకు బీజేపీ హామీ
బండి సంజయ్
  • Share this:
గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల వేళ నగరవాసులపై ప్రధాన పార్టీలు హామీల జల్లు కురిపిస్తున్నాయి. దుబ్బాక గెలుపుతో జోష్ మీదున్న బీజేపీ ఈ జీహెచ్ఎంసీలోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో హైదరబాద్ వాసులను ఆకట్టుకునేలా హామీలు ప్రకటించింది. గ్రేటర్‌లో బీజేపీని గెలిపిస్తే వరద బాధితులకు రూ.10వేలు కాదు.. రూ.20వేలు వరద సాయం అందజేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. వరద మునిగి పాడయిన కార్లు, బైక్‌లు స్థానంలో కొత్తవి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు కూలిపోయిన వారికి కొత్త ఇల్లు కట్టిస్తామని వెల్లడించారు. అంతేకాదు ఇంటి లోపలికి వరద నీరు వచ్చిన వారికి ఫర్నిచర్ కూడా అందజేస్తామని చెప్పారు బండి సంజయ్.

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటే.. నగరవాసులందరికీ ట్రాఫిక్ చలాన్లు మాఫీ చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీయే చలాన్లు కట్టేలా చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు. ఎల్‌ఆర్ఎస్‌ను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్. ఒక జాతీయ పార్టీ లేఖనే ఫోర్జరీ చేశారంటే... ఇక ప్రజల ఆస్తులకు భరోసా ఏంటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నిజంగా హిందువైతే.. నకిలీ లేఖపై ప్రమాణం చేయడానికి రేపు 12 గంటలకు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణానికి రావాలని డిమాండ్ చేశారు.

కాగా, నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్లు పరిశీలిస్తారరు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు 22 వరకు గడువు ఉంటుంది. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 19, 2020, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading