Home /News /politics /

GHMC ELECTIONS 2020 WE WILL CONTINUE FLOOD RELIEF ASSISTANCE FROM DECEMBER 7 SAYS CM KCR SK

CM KCR: హైదరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. డిసెంబరు 7 నుంచే..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

GHMC Elections 2020: కేంద్రాన్ని వరద సాయం రూ.1300 కోట్లు ఇవ్వాలని కోరామని.. 13 పైసలు కూడా ఇవ్వలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. బెంగళూరుకు, అహ్మదాబాద్‌కు ఇచ్చినోళ్లు..మాకు ఎందుకు ఇవ్వరని.. ఈ వివక్ష ఎందుకని.. కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...
  జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో వరద సాయంపై ఎంత రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. వరదలతో నిండా మునిగిన పేదలకు రూ.10వేలు ఇస్తుంటే.. బీజేపీయే ఆపిందని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తమకు ఎలాంటి సంబంధం లేదని..డబ్బులు ఇవ్వలేక రాష్ట్ర ప్రభుత్వమే చేతులెత్తేసిందని బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల్లో గెలిపిస్తే.. మేం ఇంతిస్తాం.. మేం అంతిస్తాం.. అని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నగర వాసులకు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) శుభవార్త చెప్పారు. ఎన్నికల కారణంగా ఆగిపోయిన వరద సాయం పంపిణీని.. డిసెంబరు 7 నుంచి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బాధితులందరికీ సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎల్బీస్టేడియం బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు సీఎం కేసీఆర్.

  వరదలు, వరద సాయంపై సీఎం కేసీఆర్:

  హైదరాబాద్‌ వరద ముంపుకు గురవుతుంది. మాటు చెబితే పోవు. ఈ సమస్యల నుంచి బయట పడేందుకు ఏడాదికి రూ.10వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తాం. నాలాలు కబ్జా అయ్యాయి. దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉంది. జీహెచ్ఎంసీని గెలిపిస్తే ప్రభుత్వం అండగా ఉంటుంది. వరదల నుంచి శాశ్వత విముక్తి కల్పిస్తాం.

  మెట్రోను మరింత విస్తరించాలి. ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం. కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సహకాలు ఇస్తాం. పచ్చదనం పెరగాలి. గాలి నాణ్యత పెరగాలి.

  మూసీని గోదావరి నదితో అనుసంధానం చేస్తాం. అందమైన మూసీ తయారు చేసే బాధ్యత నాది. చల్లటి హైదరాబాద్.. చక్కటి హైదరాబాద్ కావాలి. అందరూ ఆనందంగా ఉండాలి. ప్రజలందరూ నవ్వుతూ జీవించాలి.

  దేశంలో వరదలు రాని నగరమే లేదు. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్ కూడా వరదలో మునిగినవే. దురదృష్టం కొద్దీ మన నగరంలోనూ వచ్చాయి. మన మంత్రులు, ఎమ్మెల్యేలు వరద నీటిలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించారు.

  వరద బాధితులు అడగకున్నా.. ఇంటికి రూ.10వేల సాయం అందించాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఈ సాయం ఏ రాష్ట్రాలు ఇవ్వలేదు. ముంబైలో ఇవ్వలేదు. బెంగళూరులో ఇవ్వలేదు. ఢిల్లీలో ఇవ్వలేదు. ఈడ మాత్రం కిరికిరి పెడుతున్నారు. ఇప్పటి వరకు ఆరున్నర లక్షల కుటుంబాలకు రూ.650 కోట్లు ఇచ్చాం.

  పేద ప్రజలకు వరద సాయం ఇస్తుంటే లేఖలు రాసి బంద్ చేయించారు. ఎన్నికలు ముగిసినా కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది. డిసెంబరు 7 నుంచి ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.10వేల సాయం కొనసాగిస్తాం. మా బిడ్డలకు ఇంకా ఎన్ని వందల కోట్లయినా ఇస్తాం. ఎవరూ బాధపడవద్దు.

  వరదలు వచ్చాయని.. ఆదుకోవాలని కేంద్రాన్ని కోరాం. రూ.1300 కోట్లు ఇవ్వాలని కోరితే.. 13 పైసలు కూడా ఇవ్వలేదు. బెంగళూరుకు, అహ్మదాబాద్‌కు ఇచ్చినోళ్లు..మాకు ఎందుకు ఇవ్వరు. ఈ వివక్ష ఎందుకు? మేం ఇండియాలో లేమా..?

  వరద సాయం ఇవ్వలేదు గానీ.. ఇప్పుడు ఎన్నికల కోసం వరదలా నేతలు వస్తున్నారు. ఎక్కడెక్కి నుంచో వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇవి మున్సిపల్ ఎన్నికలా? జాతీయ ఎన్నికలా? బక్క కేసీఆర్‌ను కొట్టేందుకు ఇంత మంది వస్తారా? కేసీఆర్.. తెలంగాణ గడ్డ బిడ్డ. పౌరుషం ఉన్న బిడ్డ. ఎవ్వరికీ భయపడేది లేదు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Hyderabad - GHMC Elections 2020, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు