GHMC ELECTIONS 2020 WE WILL CHANGE HYDERABAD NAME AS BHAGYNAGAR SAYS UP CM YOGI ADITYANATH SK
Yogi Adityanath: హైదరాబాద్ పేరును మారుస్తాం.. పాతబస్తీ సభలో యోగి
భాగ్యనగర్ శంఖారావంలో యోగి
GHMC Elections: వరద సాయం పేరిట టీఆర్ఎస్ సర్కార్ అవినీతికి పాల్పడిందని యోగి మండిపడ్డారు. వరద బాధితులకు వరద సాయం డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
బీజేపీ (BJP)ని గెలిపిస్తే హైదరాబాద్ (Hyderabad)ను భాగ్యనగర్‌గా మారుస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. కేసీఆర్ రూపంలో మరో నిజాం వస్తున్నారని విమర్శించారు. శనివారం నగరంలో పర్యటించిన యోగి ఆదిత్యనాథ్.. కూకట్ పల్లి, జీడిమెట్ల, మల్కాజ్గిరి ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం పాతబస్తీలోని లాల్‌దర్వాజ ఆలయం సమీపంలో జరిగిన 'భాగ్యనగర్ శంఖారావం' బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంఐఎంతో కలిసి తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు.
'' నిజాం వ్యతిరేక పోరాటం సర్దార్ పటేల్‌తో సాకారమైంది. 400 ఏళ్లకు పైగా కార్యరూపం దాల్చని రామ మందిరం మోదీ హయాంలో సాధ్యమైంది. అయోధ్యంలో భవ్యమైన రామమందిరం నిర్మితమవుతోంది. హైదరాబాద్ పేరు భాగ్యనగర్‌గా మార్చవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు మార్చలేం. ఫైజాబాద్‌ను అయోధ్యగా, అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చినప్పుడు హైదరాబాద్ భాగ్యనగర్‌గా ఎందుకు మారకూడదు. మూసీని ఎంఐఎం, టీఆర్ఎస్ పూర్తిగా కబ్జా చేశాయి. అవినీతి లేని పాలన కోసం బీజేపీని గెలిపించండి. ఎన్నికల్లో గెలిచి ఢిల్లీ నుంచి నేరుగా నిధులు తెచ్చుకోండి.'' అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
వరద సాయం పేరిట టీఆర్ఎస్ సర్కార్ అవినీతికి పాల్పడిందని యోగి మండిపడ్డారు. వరద బాధితులకు వరద సాయం డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తల కోసమే నగదు రూపంలో పంపిణీ చేపట్టారని విమర్శించారు. అసలైన బాధితులకు ఇవ్వకుండా కార్యకర్తలకే డబ్బులను పంచారని దుయ్యబట్టారు యూపీ సీఎం యోగి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఎందుకు ఇళ్లు కట్టలేదని.. యూపీలో బీజేపీ సర్కార్ 15 లక్షల ఇళ్లను ఇచ్చిందని అన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన పోయి.. అభివృద్ధి జరగాలంటే ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.