GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలంటూ పిల్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

GHMC Elections: మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మేయర్, కార్పోరేటర్ల రిజర్వేషన్‌లే సక్రమంగా జరగలేదన్న అడ్వొకేట్ రచనా రెడ్డి పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లు సరిగ్గా జరగనందున వెంటనే ఎన్నికలను నిలుపుదల చేయాలని రచనా రెడ్డి హైకోర్టును కోరారు.

news18-telugu
Updated: November 25, 2020, 3:11 PM IST
GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలంటూ పిల్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
GHMC Elections 2020: హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీల నేతలు మాటల తూటాలతో నగర వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగి.. బస్తీలన్నీ కలియ తిరుగుతున్నారు. ఎంఐఎం, బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో దూకుడు మీదున్నారు. అభివృద్ధే తమ నినాదమంటూ ప్రజల్లోకి వెళ్లింది టీఆర్ఎస్. ఇలాంటి సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు(Telangana High court) కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రేటర్ ఎన్నికల రిజర్వేషన్‌లపై తాము ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది.

మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మేయర్, కార్పోరేటర్ల రిజర్వేషన్‌లే సక్రమంగా జరగలేదన్న అడ్వొకేట్ రచనా రెడ్డి పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లు సరిగ్గా జరగనందున వెంటనే ఎన్నికలను నిలుపుదల చేయాలని రచనా రెడ్డి హైకోర్టును కోరారు. ఈ పిల్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం .. మరో వారంలో ఎన్నికలు జరగనున్నందున ఇప్పుడు తాము ఏలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఎన్నికలపై దాఖలైన పిల్స్, రిట్ పిటీషన్‌లను అన్ని కలిపి డిసెంబర్ 23న విచారిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేసింది.

కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించారు. 21న నామినేషన్లు పరిశీలించారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 25, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading