GHMC ELECTIONS 2020 UNION MINISTER AMIT SHAH ROAD SHOW ENDS IN HYDERABAD SK
Amit shah in Hyderabad: మధ్యలోనే ముగిసిన రోడ్‌షో.. ప్రసంగించకుండా వెళ్లిపోయిన అమిత్ షా
హైదరాబాద్‌లో అమిత్ షా
Amit Shah Hyderabad Tour: అంతకు ముందు చార్మినార్ (Charminar) భాగ్యలక్ష్మి ఆలయాన్ని (Bhagya Laxami Temple) అమిత్ షా (Amit Shah) సందర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు
జీహెచ్ఎంసీ (Greater Hyderabad Munivipal Corporation) ఎన్నికల వేళ హైదరాబాద్ (Hyderabad) కాషాయమయమైంది. చివరి రోజు ప్రచారాన్ని బీజేపీ నేతలు హోరెత్తిస్తున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా నగరంలో పర్యటిస్తున్న నేపథ్యంలో బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. అమిత్ షా (Amit Shah) రోడ్ షోకు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రోడ్ షో నెమ్మదిగా ముందుకు కదలడంతో మధ్యలోనే ముగించారు. వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి ఫ్లై ఓవర్ వరకు సాగాల్సిన రోడ్‌షో.. నామాలగుండు వద్దే ఆగిపోయింది. కార్యకర్తలు ముందుకు కదలకపోవడంతో.. ప్రచార వాహనాన్ని దిగి కారులో నాంపల్లికి వెళ్లిపోయారు అమిత్ షా. ఐతే రోడ్ షోలో అమిత్ షా ప్రసంగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ వారాసిగూడ నుంచి నామాలగుండు దాకా ఎక్కడా ఆయన ప్రసంగించలేదు. మరికాసేపట్లో అమిత్ షా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రసగించనున్నారు.
అంతకు ముందు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని (Bhagyalaxmi Temple) అమిత్ షా సందర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో హారతిచ్చారు అమిత్ షా. అనంతరం అక్కడి నుంచి కాన్వాయ్‌లో వారాసిగూడకు చేరుకున్నారు. వారాసిగూడ నుంచి నామాలగుండు వరకు రోడ్ షో నిర్వహించారు. అమిత్ షా రోడ్‌కు జనం భారీగా తరలివచ్చారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున అమిత్ షా రావడం తమకు ఎంతగానో ప్లస్ అవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కార్యకర్తల్లో సరికొత్త జోష్ కనిపిస్తోందని చెప్పారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక విజయంతో ఊపుమీదున్న కాషాయ దళం..దాన్ని అలాగే కొనసాగించాలని పక్కాగా వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర నేతలతో పాటు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను రంగంలోకి దించింది. ఇప్పటికే హైదరాద్‌లో ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, దేవేంద్ర ఫడ్నవీస్, జేపీ నడ్డా, తేజస్వి సూర్య, యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు. ఇవాళ కేంద్రహోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకోవంతో పాటు ఎక్కువ సీట్లు సాధించి.. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
గ్రేటర్లో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదు. ఇక డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. డిసెంబరు 4 కౌంటింగ్ జరిపి.. ఫలితాలను ప్రకటిస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఎన్నికల అధికారులు బిజీగా ఉన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.