GHMC Elections: ఇది అహ్మదాబాద్ కాదు.. హైదరాబాద్.. బీజేపీకి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

GHMC elections 2020: పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో నిప్పు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ప్రశాంతంగా ఉండే నగరంలో అలజడి రేపి, అరాచకం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: November 21, 2020, 6:51 PM IST
GHMC Elections: ఇది అహ్మదాబాద్ కాదు.. హైదరాబాద్.. బీజేపీకి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
కేటీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
హైదరాబాద్‌లో అసలు ఆట మొదలయింది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. ఎప్పటిలాగే టీఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మంత్రి కేటీఆర్ కూకట్‌పల్లిలోని ఓల్డ్ అల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాట్లాడిన ఆయన.. ప్రధానంగా బీజేపీనే టార్గెట్ చేసుకున్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించేందుకే బీజేపీ వచ్చిందని విరుచుకుపడ్డారు. హిందూ-ముస్లిం మధ్య చిచ్చు పెట్టి ఓట్ల సాధించాలని భావిస్తోందని మండిపడ్డారు. ఈ నగరం ప్రశాంతంగా ఉందనే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు వచ్చాయని..ఇప్పుడా వాతావరణాన్ని బీజేపీ నేతలు చెడగొడుతున్నారని ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్.

''ఎన్నికల వేళ కొత్త బిచ్చగాళ్లు వచ్చారు. చలాన్లు కొట్టొద్దు.. బండిపై నలుగురు ఎక్కొచ్చని ఒకాయ అంటున్నాడు. తాగి బండి నడపవచ్చంట. బండి పోతే బండి ఫ్రీ. కారుపోతే కారు ఫ్రీ. ఇల్లు పోతే ఇల్లుఫ్రీ. 25వేలు ఇస్తానని ఆయన అంటున్నాడు. వరదసాయం రూ.10వేలు ఇస్తుంటే మీరే ఆపారు. అలాంటిది రూ.25 వేలు ఇస్తారా? అమ్మకు అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తడా? వరదల సమయంలో మేమంతా మీవెంటే ఉన్నాం. రూ.650 కోట్లు మంజూరు చేశాం. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఇస్తాం. బీజేపీ నేతల కథలు వినేందుకు.. ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు. ఉషార్.. హైదరాబాద్. మీ డ్రామాలు నడవవు. మీరు ఆగమాగం చేస్తే ఎవరూ కారు. ఆరేళ్లలో హైదరాబాద్‌లో మేం ఎన్నో చేశాం. వంద పనులు.. గంటల తరబడి చెబుతాం. ఆరేళ్లలో హైదరాబాద్‌కు కేంద్రం ఏం చేసింది? కిషన్ రెడ్డికి దమ్ముంటే ఒక్కటంటే ఒక్క పని చూపించండి.'' అని మంత్రి కేటీఆర్ అన్నారు.

పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో నిప్పు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ప్రశాంతంగా ఉండే నగరంలో అలజడి రేపి, అరాచకం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని విరుచుకుపడ్డారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉండి.. అభివృద్ధి సాధించాలన్నదే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. బీజేపీ నేత ఒకాయన కావాలని పాతబస్తీకి వెళ్లి రచ్చ చేశారని.. హైదరాబాద్‌లో దేవాలయాలు ఇంకెక్కడా లేవా.. అని ప్రశ్నిచారు మంత్రి కేటీఆర్. ఇది రెచ్చగొట్టడం కాదా.. అని నిలదీశారు. హిందువులు, ముస్లింలు కలిసి ఉంటే బీజేపీ నేతల కళ్లు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆగమైతే తెలంగాణ కూడా ఆగమైతదన్న మంత్రి.. అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో.. తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.

కాగా, నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు గాను 2600 నామినేషన్లు దాఖలయ్యాయి. 21న నామినేషన్లు పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు 22 వరకు గడువు ఉంటుంది. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 21, 2020, 6:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading