Hyderabad GHMC Elections 2020 Live: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రక్రియ ముగిసింది. ఐతే ఆరు గంటల లోపు క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. గ్రేటర్లో గతం కంటే ఈసారి చాలా తక్కువ పోలింగ్ నమోదయింది. ప్రభుత్వం, అధికారులు, సెలబ్రిటీలు, మీడియా ఎంత చెప్పినప్పటికీ.. నగర ప్రజలు మాత్రం ఓటేసేందుకు ముందుకు రాలేదు. చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యంగా కనిపించాయి. పలుచోట్ల సిబ్బంది నిద్రపోయారు. ఎంతో మంది ఉన్నత విద్యావంతులు ఉన్న ఈ నగరంలో తక్కువ స్థాయిలో పోలింగ్ జరగడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, గుర్తులు తారుమారవడంతో ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్లో పోలింగ్ రద్దయింది. డిసెంబరు 3న అక్కడ రీపోలింగ్ జరగనుంది. రీపోలింగ్ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించారు. డిసెంబరు 4న 150 డివిజన్లలో ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు.
Read More