GHMC ELECTIONS 2020 HYDERABAD IS YOUR FUTURE CM KCR MESSAGE TO YOUTH SK
CM KCR: హైదరాబాద్‌ను కాపాడుకునే బాధ్యత మీదే.. యువతకు కేసీఆర్ పిలుపు
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
GHMC ELECTIONS: నగరంలోని మేధావులంతా ఏకమై ఆలోచించాలని.. హైదరాబాద్(Hyderabad)లో జరుగుతున్న దానిపై ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. తమ బాస్ ఢిల్లీలో లేడన్న సీఎం కేసీఆర్ (CM KCR).. తెలంగాణ రాష్ట్ర ప్రజలే తమ బాస్‌లని స్పష్టం చేశారు.
హైదరాబాద్ (Hyderabad)ను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందని సీఎం కల్వకుంట చంద్రశేఖర్ రావు (CM KCR) తెలిపారు. విభజన శక్తుల మాటలు, పిచ్చిప్రేలాపనలకు ఆకర్షితమైతే మీ భవిష్యత్తే నాశనమవుందని అన్నారు. నగరంలోని మేధావులంతా ఏకమై ఆలోచించాలని.. హైదరాబాద్‌లో జరుగుతున్న దానిపై ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. తమ బాస్ ఢిల్లీలో లేడన్న సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రజలే తమ బాస్‌లని స్పష్టం చేశారు. ఏం చేసినా రాష్ట్ర ప్రజల కోసమే చేస్తామని తెలిపారు. కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారని.. ఐనా నిబద్ధత గల పార్టీగా, మేం రెచ్చిపోమని పేర్కొన్నారు.
శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ ప్రసంగం:
గత ఆరేడేళ్ల నుంచి శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయి. రౌడీ మూకలు, ముష్కరులను ఎక్కడికక్కడ అణచివేశాం. నగరంలో ఉన్న సీసీ కెమెరాలు ఇంకెక్కడా లేవు. ఇండియాలోనే మనం నెంబర్. నేరాలు జరిగిన గంటల్లోనే పోలీసులు పట్టుకుంటున్నారు. అంద అద్భుతమైన ప్రగతిని సాధించాం.
నగరం శాంతియుతంగా ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి. ఉపాధి దొరుకుతుంది. హైదరాబాద్‌లో కల్లోలాలు, కర్ఫ్యూలు జరిగితే ముందుకు సాగదు. పరిస్థితి దారుణంగా తయారవుతుంది. బిల్డర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు అందరూ ఆలోచించాలి. మీకు బీపాస్ కావాలా? కర్ఫ్యూ పాస్ కావాలో ఆలోచించుకోవాలి.
కొందరు పిచ్చిపిచ్చిగా ప్రచారం చేస్తున్నారు. ఏవేవో మాట్లాడుతున్నారు. అవి ఏ రకంగానూ మంచిది కాదు. పక్క రాష్ట్రం వాడువచ్చి ఏదేదో మాట్లాడి వెళ్లిపోతాడు. కానీ ఇక్కడ ఉండేది మనమే. ఆ తర్వాత బాధపడాల్సింది మనమే. అందరూ ఆలోచించుకోవాలి.
పిచ్చి ప్రేలాపనలకు ఆకర్షితమైతే తెలంగాణ భవిష్యత్ నాశనం అవుతుంది. భూములు, ఆస్తులు విలువలు తగ్గుతాయి. ఉపాధి అవకాశాలు పోతాయి. కళకళలాడే హైదరాబాద్‌ను సాధించుకుందాం. నగరాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత నాది.
పిచ్చి మాటలు నమ్మితే చాలా దెబ్బతింటాం. మేధావులు ముందుకు కదలాలి. వాస్తవాలను ప్రజలకు వివరించాలి. యువత అందరూ ఆలోచించాలి. హైదరాబాద్‌ను మీరే కాపాడుకోవాలి. అప్పుడే మీ భవిష్యత్ బాగుంటుంది.
నన్ను తిట్టినా .. టెంప్ట్ కావడం లేదు. నాకు చేత కాక కాదు. నేను కూడా బ్రహ్మాండంగా తిట్టగలుగుతాం. పౌరుషం లేక కాదు. తలచుకుంటే దుమ్ము దులుపుతాం. ఏమైనా చేయగలం. మా కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారు. సంయమనం పాటిస్తున్నాం. రాష్ట్రాన్ని నడిపిస్తున్న పార్టీగా నిబద్ధత మాపై ఉంది.
మేం ఢిల్లీకి గులాం కాదు. మా బాస్‌లు ఢిల్లీలో లేరు. తెలంగాణ ప్రజలే మా బాస్‌లు. మీ చిల్లర మాటలకు మేం టెంప్ట్ కాము. మా పేదల సంక్షేమమే.. మా రాష్ట్ర అభివృద్ధే మా కల.. మా లక్ష్యం. ఎవ్వరికీ భయపడం. రాజీపడం.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.