గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. 19 మందితో రెండు జాబితాను రిలీజ్ చేసింది. నిన్న 21 మందితో మొదటి జాబితా రిలీజ్ చేసింది. ఈ రోజు మరో 19 మంది పేర్లను ప్రకటించింది. ఇతర పార్టీల నుంచి వలసలు, పార్టీలో టికెట్ల కోసం భారీగా ఆశావహులు ఉన్న నేపథ్యంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని చూస్తోంది. అందుకే పలుమార్లు వడపోతల తర్వాత అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో సారి టీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర వాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు జోకర్లు, ఎంటర్ టైనర్లుగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎంటర్ టైన్ మెంట్ కావాలంటే ప్రజలు కేసీఆర్, కేటీఆర్ ప్రెస్ మీట్లు చూడాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ మధ్యే ఫైట్ అని అన్నారు. టీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదన్నారు. టీఆర్ఎస్ కు ఏమైనా సీట్లు వస్తే తప్పకుండా ఎంఐఎం అభ్యర్థే మేయర్ అవుతారన్నారు.
GHMC Elections: BJP 2nd List
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఓల్డ్ సిటీకి, మిగతా సిటీకి మధ్య పోటీ అని అన్నారు. తమ వ్యూహాలను ప్రచారంలోనే చూపిస్తామన్నారు. కేసీఆర్ పెడతానన్న ఫెడరల్ ఫ్రంట్ కనిపించలేదని.. థార్డ్ ఫ్రంట్ పత్తా లేదన్నారు. కేసీఆర్ ఇప్పుడు కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తే దేశాలన్నీ భయపడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. భయటకు వెళ్తే ప్రజలు కొడతారని కేసీఆర్, కేటీఆర్ భయపడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు.
మరోవైపు ఎన్నికల ప్రచారానికి బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. మొత్తం పది మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటిస్తూ ఎన్నికల అధికారికి జాబితాను అందించింది.
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా
బండి సంజయ్ ( రాష్ట్ర అధ్యక్షుడు)
కిషన్ రెడ్డి (కేంద్ర మంత్రి)
డీకే అరుణ
లక్ష్మణ్
మురళీదర్ రావు
వివేక్
గరికపాటి మోహన్‌రావు
రాజాసింగ్(గోషామాల్ ఎమ్మెల్యే)
ధర్మపురి అరవింద్
రఘునందన్‌రావు (దుబ్బాక ఎమ్మెల్యే)
బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీ మహిళా నాయకురాలు విజయలతారెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించారు. బీజేపీ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేయాలని భావించిన విజయలతారెడ్డి.. పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ వల్లే తనకు కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు టికెట్ లభించలేదని ఆమె ఆరోపించారు. ఆయన ప్రమేయంతోనే తనకు దక్కాల్సిన టికెట్ ఇతరులకు కేటాయించారని అన్నారు. ఈ క్రమంలోనే ఆమె నాచారంలో ఆత్మహత్య యత్నం చేశారు. ఇది గమనించిన కుటుంబస సభ్యులు ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా సమాచారం.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అయితే ఈ సారి కూడా బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా బరిలో నిలవాలని విజయలతారెడ్డి ప్రయత్నాలు చేశారు. అయితే టికెట్ దక్కకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.