Amit Shah in Hyderabad: జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే.. అమిత్ షా ధీమా

Amit Shah in Hyderabad: రాజకీయాల్లో పొత్తులు సహజంమని ఎవరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చని అమిత్ షా (AMit Shah) అన్నారు. కానీ మజ్లిస్‌(MIM)తో టీఆర్ఎస్‌(TRS)కు చాటుమాటు ఒప్పందాలు ఎందుకని ప్రశ్నించారు.

news18-telugu
Updated: November 29, 2020, 3:57 PM IST
Amit Shah in Hyderabad: జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే.. అమిత్ షా ధీమా
అమిత్ షా ప్రెస్ మీట్
  • Share this:
జీహెచ్ఎంసీ (Greater Hyderabad Municipal corporation) పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని కేంద్రహోంమంత్రి అమిత్ షా (AMit Shah) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటువుతుందని చెప్పారు. ఇచ్చిన వాగ్ధానాలను టీఆర్ఎస్ అమలు చేయడం లేదని.. అవినీతి పాలన కోసం బీజేపీని గెలపించాలని నగర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించిన అమిత్ షా.. చార్మినార్ భాగ్యలక్ష్మీ (Charminar Bhagyalaxmi temple) ఆలయంలో పూజలు చేశారు. అనంతరం వారాసిగూడలో రోడ్‌షో నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. మేకిన్‌ ఇండియా ఫలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని.. నగరానికి భవిష్యత్‌లో మరిన్ని ఐటీ సంస్థలు వచ్చేలా చేస్తాలా కృషిచేస్తామని అన్నారు.


''బీజేపీని ఆదరిస్తున్న హైదరాబాద్ ప్రజలకే ధన్యవాదాలు. ఈసారి సీట్లు, ఓట్ల శాతం పెంచుకోవడానికి బీజేపీ పోటీచేయడం లేదు. మేయర్ పీఠ గెలవడమే బీజేపీ లక్ష్యం. ఘనస్వాగతం పలికిన హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. ప్రజల ఆదరణ చూసిన తర్వాత బీజేపీ ఖచ్చితంగా మేయర్ పదవి గెలుస్తుందని నమ్మకం కుదిరింది. ఇవీ గల్లీ ఎన్నికలు అనేవారు. గల్లీని ఎందుకు బాగు చేయలేదు. హైదరాబాద్ మినీ ఇండియా లాంటి. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. హైదరాబాద్ కోసం కేంద్రం ఎన్నో విధాలుగా సాయం చేసింది. వరదలప్పుడు రెండు విడతల్లో రూ.500 కోట్లు ఇచ్చాం. కేసీఆర్ సచివాలయానికి వెళ్లే కదా.. నిధులు ఇచ్చామో లేదో తెలిసేది. మేకిన్ ఇండియా ఫలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయి. బీజేపీకి అవకాశం ఇస్తే అవినీతిని పాలద్రోలుతాం. కేంద్రం తెచ్చిన వీధి వ్యాపారుల పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేయలేదు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్మరించారు. తెలంగాణలో లక్షా 30వేల ఇళ్లకు కేంద్రం నిధులు ఇచ్చింది.'' అని అమిత్ షా అన్నారు.''నిజాం సంస్కృతి నుంచి విముక్తి కల్పిస్తాం. ప్రజాస్వామ్య విలువలతో కూడిన సరికొత్త హైదరాబాద్‌ను తయారుచేస్తాం. వారసత్వ రాజకీయాలు, అవినీతి నుంచి నగర ప్రజలను అభివృద్ధి వైపు నడిపిస్తాం.'' అని అమిత్ షా అన్నారు.రాజకీయాల్లో పొత్తులు సహజంమని ఎవరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చని అమిత్ షా అన్నారు. కానీ మజ్లిస్‌తో టీఆర్ఎస్‌కు చాటుమాటు ఒప్పందాలు ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వందరోజుల్లో అభివృద్ధి ప్రణాళిక ఇచ్చి ఐదేళ్లు పూర్తయినా.. అభివృద్ధి మాత్రం జరగలేదని అమిత్ షా విమర్శించారు. వర్షాలు, వరదలకు నగరంలోని సుమారు 7లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారుని..ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కేసీఆర్‌, అసదుద్దీన్‌ ఒవైసీ ఎందుకు రాలేదని అన్నారు. నగరంలోని నాలాలు, చెరువులపై అక్రమ కట్టడాలు ఉన్నాయని.. బీజేపీని గెలిపిస్తే వాటిని కూల్చివేసి, నగర ప్రజలకు వరద కష్టాలను తీర్చుతామని అమిత్ షా తెలిపారు. తాము వాగ్దానం చేశామంటే అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: November 29, 2020, 3:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading