ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్

1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సవాంగ్ 1963 జులై 10న జన్మించారు. నిన్నటివరకు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు

news18-telugu
Updated: June 1, 2019, 2:34 PM IST
ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్
సీఎం జగన్‌తో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
  • Share this:
ఆంధ్ర ప్రదేశ్ కొత్త డీజీపీగా గౌతమ్ సవాంగ్ నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్ద పీఠ వేస్తామన్నారు. సేవాభావంతో కలిసి పనిచేస్తామన్నారు. డీజీపీగా తనకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు గౌతమ్ సవాంగ్. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రికి పోలీసుల పట్ల ఎంతో అభిమానం, గౌరవం వుందన్నారు.సేవా భావంతో పోలీస్ శాఖ పని చేయాలని ముఖ్యమంత్రి కోరారని తెలిపారు.పేద ప్రజలు,సామాన్య ప్రజలకి పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. నేర రహిత రాష్ట్రంగా ఏపీనీ చేసేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేయాలన్నారు గౌతమ్ సవాంగ్.సైబర్ క్రైమ్ అరికట్టడంలో ఏపీ పోలీస్ మరింత కష్టపడాలన్నారు.
పోలీస్ శాఖకు కావలసిన అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తాం అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా తెలిపారు.

1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సవాంగ్ 1963 జులై 10న జన్మించారు. నిన్నటివరకు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు సవాంగ్. తర్వాత చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2001-2003 మధ్య వరంగల్‌ రేంజి డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు.అంతకుముందు హోంగార్డు విభాగం డీఐజీగానూ సేవలందించారు. గతేడాది జులై 1న ఆర్‌.పి.ఠాకూర్‌ ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 11 నెలలుగా పదవిలో కొనసాగారు. ఆయన స్థానంలో సవాంగ్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్‌ స్టోర్స్, పర్ఛేజ్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏడీజీగా బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును వేరొక పోస్టులో నియమించే వరకు పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.First published: June 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు