జగన్ రాకతో మొదలైన మార్పులు... మారనున్న ఏపీ డీజీపీ

చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు సవాంగ్. తర్వాత చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు.

news18-telugu
Updated: May 26, 2019, 8:41 AM IST
జగన్ రాకతో మొదలైన మార్పులు... మారనున్న ఏపీ డీజీపీ
గౌతమ్ సవాంగ్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 26, 2019, 8:41 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో మార్పులు మొదలయ్యాయి. వైసీపీ ప్రభంజనంతో ఏపీలో అధికారం మారింది. టీడీపీ చేతుల నుంచి అధికారం వైసీపీ చేతుల్లోకి వచ్చింది. అయితే ఏపీలో కొత్త సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముందే... అధికారుల బదిలీలు జరిగిపోతున్నాయి. ఏపీ కొత్త డీజీపీగా దామోదర్ గౌతమ్ సవాంగ్ నియమితులు కానున్నట్లు సమాచారం. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సవాంగ్ 1963 జులై 10న జన్మించారు. ప్రస్తుతం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు సవాంగ్. తర్వాత చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2001-2003 మధ్య వరంగల్‌ రేంజి డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు.అంతకుముందు హోంగార్డు విభాగం డీఐజీగానూ సేవలందించారు.

ప్రస్తుత డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసుశాఖపరంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ పురపాలక మైదానాన్ని శనివారం సాయంత్రం ఆయన సందర్శించి అధికారులతో సమీక్షించారు. గతేడాది జులై 1న ఆర్‌.పి.ఠాకూర్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 11 నెలలుగా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో సవాంగ్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఠాకూర్‌.. మధ్యాహ్నం హైదరాబాద్‌కు వెళ్లారు. గతంలో ఏపీ డీజీపీ నియామకం విషయంలో గౌతమ్ సవాంగ్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఠాకూర్‌ను డీజీపీగా నియమించింది.

First published: May 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...