జిలేబీ తినడం మానేస్తా... వారికి గంభీర్ కౌంటర్

కాలుష్యం అంశంపై జరిగిన సమావేశానికి తాను హాజరుకాకపోవడంపై వస్తున్న విమర్శలకు బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించారు.

news18-telugu
Updated: November 18, 2019, 7:26 PM IST
జిలేబీ తినడం మానేస్తా... వారికి గంభీర్ కౌంటర్
గౌతమ్ గంభీర్
  • Share this:
కాలుష్యం అంశంపై జరిగిన సమావేశానికి తాను హాజరుకాకపోవడంపై వస్తున్న విమర్శలకు బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించారు. తాను జిలేబి తినడం వల్లనే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందా ? మీడియాను ఎదురు ప్రశ్నించారు. అలా అయితే చెప్పండి... ఇక నేను జిలేబీ తినడం మానేస్తా అని సమాధానమిచ్చారు. కేవలం 10నిమిషాల్లోనే తనను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టేశారని గంభీర్ అన్నారు. ఈ కష్టమేదో ఢిల్లీ కాలుష్యం నివారించడంపై ఫోకస్ చేస్తే స్వేచ్ఛగా గాలి తీసుకోవచ్చు అంటూ తనను విమర్శించిన వారికి కౌంటర్ ఇచ్చారు.

కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కాలుష్యం అంశంపై సమావేశానికి గౌతం గంభీర్ రాకపోవడంతో... ఆయన కనుబడుట లేదంటూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు కలకలం రేపాయి. అదే సమయంలో వీవీఎస్ లక్ష్మణ్‌తో గంభీర్ జిలేబీ తింటున్న ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో గంభీర్ సమావేశానికైతే రాలేకపోయాడు కానీ, జిలేబీలు తినడానికి వెళ్తున్నాడంటూ కామెంట్లు వినిపించాయి.


First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>