Home /News /politics /

GAS CYLINDER PRICES HIKE LPG TO COST MORE THAN RS 1000 PER CYLINDER

సామాన్యుడి నెత్తిన గ్యాస్ బండ.. సిలిండర్ ధర @ రూ.1000

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మూడ్రోజుల నుంచి వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,000.49 గా ఉంది. ఇందులో రూ. 952.85పైగా ఉండగా జీఎస్టీ కలుపుకుని రూ.1,000.49పైసలు అయ్యింది

    గ్యాస్ బండ ఇప్పుడు మరింత భారంగా మారింది. ఓ వైపు నిత్యవసర వస్తువుల ధరలు మండిపోతుంటే.. మరోవైపు సామాన్యుడి నెత్తిన గ్యాస్ భారం పడింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో పెట్రోల్ డీజిల్‌తో పాటు గ్యాస్ ధర కూడా అమాంతం పెరిగింది. సెంచరీకి దగ్గర్లో పెట్రోల్ ధరలుంటే.. వంట గ్యాస్ ధర కాస్త వేయి రూపాయలు దాటింది.

    కేంద్ర ప్రభుత్వం వైఖరితో ఇప్పటికే.. చమురు ధరలతో పాటు నిత్యవసరాల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు వంట గ్యాస్ కూడా ఇదే బాట పట్టడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఇలా అయితే బతికేదెలా అంటూ వాపోతున్నారు. సిటీ జీవితంలో తెల్లవారగానే ప్రతీ ఇంట్లో దాదాపుగా వెలిగేది గ్యాస్ పొయ్యే. ఒక్క పూట గ్యాస్ అయిపోయినా.. ఇక వాళ్లకు పస్తే. వంట గ్యాస్ ఇప్పుడు ప్రతీ ఒకరికి జీవితావసరం.

    2014లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 14. 2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 414గా ఉండేది. వంట గ్యాస్‌పై అందిస్తున్న రాయితీలని గతంలో ఎత్తివేయాలని భావించిన కేంద్రం అప్పటి నుంచి ప్రతీ నెల వంట గ్యాస్ ధరను పెంచాలని నిర్ణయించింది. అయితే మూడ్రోజుల నుంచి వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,000.49 గా ఉంది. ఇందులో వంటగ్యాస్ ధర రూ. 952.85పైగా ఉండగా జీఎస్టీ కలుపుకుని రూ.1,000.49పైసలు అయ్యింది. దీనికితోడు డెలివరీ బాయ్ మరో రూ.20 నుంచి 25 వసూలు చేస్తుండటంతో వినియోగదారుని జేబుకు చిల్లుపడుతుంది.

    అయితే అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన వనరుల ధరలు కారణంగానే... దేశంలో కూడా పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని చమురుసంస్థలు ప్రకటిస్తున్నాయి. ఇటు ప్రభుత్వ అధికారులు గతంలో కూడా వంట గ్యాస్ ధరలు పెరిగాయని చెబుతున్నారు. 2013లో కూడా సిలిండర్ ధర రూ. 1100 వరకు చేరిందని గుర్తు చేస్తున్నారు.

    మరోవైపు మండుతున్న వంటగ్యాస్ ధరలపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ ధర వేయిరూపాయలు దాటితే ఎలా బతుకుతామంటూ ప్రభుత్వాల్ని నిలదీస్తున్నారు. ముఖ్యంగా గృహిణులు సిలిండర్ ధరల పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: LPG Cylinder, National News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు