జగన్‌కు దూరంగా ఆ సినీనటుడు... పెరిగిన గ్యాప్... ఏం జరిగింది ?

వైసీపీ అధికారంలోకి వస్తే మోహన్ బాబుకు మంచి పదవి వస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి.

news18-telugu
Updated: June 6, 2020, 8:59 PM IST
జగన్‌కు దూరంగా ఆ సినీనటుడు... పెరిగిన గ్యాప్... ఏం జరిగింది ?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం జగన్‌కు పలువురు సినీనటులు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. వారిలో సీనియర్ నటుడు మోహన్ బాబు ఒకరు. సీఎం జగన్‌కు మోహన్ బాబుకు మధ్య బంధుత్వం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించిన మోహన్ బాబు... చంద్రబాబుపై గట్టిగానే విమర్శలు గుప్పించారు. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే మోహన్ బాబుకు మంచి పదవి వస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ బాబుకు ఎలాంటి పదవి ఇవ్వలేదు సీఎం జగన్. తాను పదవులు కోరనని మోహన్ బాబు చెబుతున్నప్పటికీ.. ఈ విషయంలో మోహన్ బాబు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం ఉంది. ఆ మధ్య కుమారులు, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిసి మోహన్ బాబు... బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే తాను కేవలం మర్యాదపూర్వకంగానే ప్రధానిని కలిశానని ఆయన వివరణ ఇచ్చారు. అయితే మోహన్ బాబు కొంతకాలంగా సీఎం జగన్ గురించి ప్రస్తావించకపోవడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Gap between mohan babu and cm ys jagan, actor mohan babu, cm ys jagan mohan reddy, ysrcp, ap politics, ap latest news, మోహన్ బాబు జగన్‌ మధ్య పెరిగిన గ్యాప్, నటుడు మోహన్ బాబు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ, ఏపీ తాజా వార్తలు
వైసీపీలో చేరిన మోహన్ బాబు(ఫైల్ ఫోటో)


సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే మోహన్ బాబు... సీఎంగా జగన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పకపోవడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే కొద్దిరోజుల క్రితం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. తన కుమారుడు మనోజ్ రాజకీయాల్లో వస్తానంటే వద్దని చెబుతానని అన్నారు. దీంతో మోహన్ బాబుకు సీఎం జగన్‌కు మధ్య గ్యాప్ పెరిగిందనే గుసగుసలు జోరందుకున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: June 6, 2020, 8:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading