హోమ్ /వార్తలు /politics /

Andhra Pradesh: ఆ కీలక నేతను లోకేష్ పక్కన పెట్టారా? పార్టీ పదవుల్లో త్వరలోనే మార్పులు తప్పవా?

Andhra Pradesh: ఆ కీలక నేతను లోకేష్ పక్కన పెట్టారా? పార్టీ పదవుల్లో త్వరలోనే మార్పులు తప్పవా?

చంద్రబాబు, లోకేష్ (ఫైల్)

చంద్రబాబు, లోకేష్ (ఫైల్)

అసలే వరుస ఓటములతో ఢీలపడ్డ టీడీపీలో పరిస్థితి మరింత గందరగోళంగా మారిందా..? పార్టీలో కొందరి సీనియర్ నేతల వ్యవహారంపై లోకేష్ సీరియస్ గా ఉన్నారా..? పార్టీకి చెందిన ఓ కీలక నేతను ఆయన పక్కన పెట్టారా..?

ఏపీలో ఇంటర్, పది పరీక్షల రద్దు విషయంలో నారా లోకేష్ విజయం సాధించారా..? ఆయన పోరాటం ఫలించిందని.. అందుకే ఇప్పుడు ఏపీ ప్రజల్లో లోకేష్ కు మంచి గుర్తింపు తెచ్చేలా పోరాటం చేశారని ఆయన్ను పొగడ్తత్లో ముంచెత్తుతున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. దీంతో ప్రస్తుతం లోకేష్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఇది తన తొలి విజయమని ఇక నుంచి మరింత దూకుడుగా ఉంటానని చెబుతున్నారట.  ప్రస్తుతం లోకేష్ ను అమాంతం పైకి ఎత్తి పొగడ్తల వర్షం కురిపించే బ్యాచ్ ఎక్కువ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా ఓ వైపు లోకేష్ మాత్రం ప్రభుత్వంపై పోరాటంలో దూకుడు పెంచుతూనే.. పార్టీ వ్యవహరాలపై పూర్తి పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఒకరిద్దరి కీలక, సీనియర్ నేతల విషయంలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యవహారంపై లోకేష్ గుర్రుగా ఉన్నట్టు టీడీపీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు అచ్చెన్నాయుడ్ని అధ్యక్షుడ్ని చేయడమే లోకేష్ కు ఇష్టం లేదని. కానీ చంద్రబాబు నిర్ణయాన్ని కాదనలేక సైలెంట్ అయ్యారని అంటున్నారు. కానీ అన్ని వ్యవహారాల్లో అచ్చెన్నాయుడికి అడ్డంకులు కలిగేలా చేశారంటూ కింజారపు సన్నిహితులు వాపోయిన సందర్భాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. ఆస్తుల వేలానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్

ఆ గ్యాప్ కారణంగానే తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అచ్చెన్న అలా కామెంట్లు చేశారని అంటున్నారు. ఆయన వ్యాఖ్యలు లీకైన తరువాత ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగినట్టు తెలుస్తోంది. అయితే ఆ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు అచ్చెన్న గానీ లేదా ఇతర నేతలు కానీ దీనిపై వివరణ ఇవ్వలేదు. అలాగే చంద్ర బాబు నాయుడు, లోకేష్ కూడా వివరణ కోరలేదని తెలుస్తోంది. కాకపోతే ఇద్దరి మధ్య మాత్రం అప్పటి నుంచే పెద్దగా మాటలు లేవంటున్నారు. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వగలిగే అచ్చెన్నాయుడ్ని పక్కన పెట్టడం చంద్రబాబుకు మాత్రం ఇష్టం లేదని.. కానీ లోకేష్ గట్టిగా ఒత్తిడి పెంచితే చంద్రబాబు కూడా ఏం చేయలేరు అంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు.

ఇదీ చదవండి: ఆనందయ్యకు సెల్యూట్.. ఆయుర్వేద మందులను ప్రోత్సహించాలన్న మద్రాస్ హైకోర్ట్

తాజాగా వైసీపీ నేతలు నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. కానీ అచ్చెన్నాయుడు సహా గట్టిగా వాయిస్ వినిపించే ఒకరిద్దరు నేతలు ఏం మాట్లాడకపోవడానికి కూడా లోకేష్ కు నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే వారిని పక్కన పెట్టి టీడీపీలో కీలక పదవులు వేరొకరికి అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే లోకేష్ టీం బీద రవిచంద్రయాదవు లాంటి వారిని పార్టీలో హైలైట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kinjarapu Atchannaidu, Nara Lokesh, TDP

ఉత్తమ కథలు