HOME »NEWS »POLITICS »ganta srinivsarao is back into active politics prn

AP Politics: వైసీపీలో చేరికపై మాజీ మంత్రి మనసు మార్చుకున్నారా..? కారణం అదేనా..?

AP Politics: వైసీపీలో చేరికపై మాజీ మంత్రి మనసు మార్చుకున్నారా..? కారణం అదేనా..?
టీడీపీ

ఆ మధ్య గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) వైసీపీ(YSRCP)లో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. సీఎం జగన్ (YS Jagan) ఆపాయింట్ మెంట్ కూడా ఖరారైనట్లు అందరూ చెప్పుకున్నారు.

 • Share this:
  గంటా శ్రీనివాసరావు రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖమైన వ్యక్తి. ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా ఆయనదే గెలుపు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో గంటా ఉంటారు. గత ఎన్నికల్లో గెలిచినా రాష్ట్రంలో టీడీపీ ఓడిపోవడంతో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్నారు. ఐతే ఇప్పుడు సడన్ గా పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో గంటా ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. అధికార వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా కుదిరినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన అందరికీ షాకిస్తూ టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గంటా ప్రకటనతో ఆయన టీడీపీని వీడరని.. పార్టీకి అండగా ఉంటారని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  ఎంవీపీ కాలనీలోని తన స్వగృహంలో విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక నేతలతో కలిసి విశాఖ నార్త్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో టీడీపీని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.


  అన్నివార్డుల్లో పార్టీ కమిటీలు నియమించి తద్వారా పార్టీ తరఫున అన్ని వార్డుల్లో ప్రజల కష్టాలు తెలుసుకునే వీలుంటుందన్నారు. కమిటీల ఏర్పాటులో ఎవరైనా అసంతృప్తి చెందితే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

  Ganta Srinivasa Rao, YSR Congress, TDP, YS Jagan, Vishakhapatnam, Vizag, Andhra Pradesh, AP politics, గంటా శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, వైఎస్ జగన్, విశాఖపట్నం, వైజాగ్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పాలిటిక్స్, విశాఖపట్నం వార్తలు, రాజకీయాలు
  గంటా శ్రీనివాసరావు


  గెలిచినా పార్టీకి దూరంగా..!
  తెలుగుదేశం పార్టీ తరపున గెలిచినా ఇన్నాళ్లూ పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన గంటా శ్రీనివాసరావు ఉన్నట్టుండి పార్టీ నేతలతో చె విశాఖ రాజకీయాల్లో చర్చనడుస్తోంది. గంటా ఇచ్చిన సడన్ సర్ ప్రైజ్ పై టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముగిసిన తర్వాత గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడుతారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఐతే పార్టీ మారే ప్రసక్తే లేదని అప్పట్లో ఆయన స్పష్టం చేశారు. కానీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన చేయడం, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించడంతో గంటా వైసీపీలో చేరడం ఖాయమని వార్తలొచ్చాయి. దీనికి తోడు టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖను రాజధానిగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మధ్యలో చంద్రబాబు విశాఖ వెళ్లినప్పుడు కూడా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో గంటా టీడీపీని వీడటం ఖాయమని ప్రచారం జరిగింది.

  అందుకే మనసు మార్చుకున్నారా..?
  ఐతే గంటా వైసీపీలో చేరడాన్ని జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్, ఇతర ఎమ్మెల్యేలు, విశాఖ నార్త్ ఇన్ ఛార్జ్ కేకే రాజు తీవ్రంగా వ్యతిరేకించారు. గంటా పార్టీలోకి వస్తే కలిసి పనిచేసే ప్రసక్తే లేదని అధిష్టానానికి స్పష్టం చేశారు. కానీ ఓ దశలో గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ వైసీపీలో చేరికకు ముహూర్తం కూడా కుదిరనట్లు తేదీలు కూడా ప్రకటించేశారు. వీటన్నింటిపై అటు గంటా వర్గం కానీ, ఇటు వైసీపీ నేతలు కానీ స్పందించలేదు. మధ్యలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు టాక్ వినిపించింది. కానీ అది కూడా వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పటికిప్పుడు మార్టీ మారితో పెద్దగా ప్రయోజనం ఉండదని భావించారో ఏమో ఆయన సైలెంట్ గా ఉన్నారు. కొన్నాళ్లుగా రాజకీయాల్లో గంటా టాపిక్ రావడం లేదు. అంతా సైలెంట్ గా ఉన్న టైమ్ ఆయన సడన్ గా పార్టీ మీటింగ్ పెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచారు.
  Published by:Purna Chandra
  First published:December 14, 2020, 16:47 IST