గంటా నిర్ణయం మారిందా... అయినా చంద్రబాబుకు షాకే ?

పార్టీ మారాలని నిర్ణయించుకున్న గంటా శ్రీనివాసరావు... తాజాగా తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: December 5, 2019, 12:29 PM IST
గంటా నిర్ణయం మారిందా... అయినా చంద్రబాబుకు షాకే ?
చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు
  • Share this:
పార్టీ మారడం మాజీమంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కొత్తేమీ కాదు. ఇప్పటికే మూడు సార్లు పార్టీ మారిన గంటా శ్రీనివాసరావు... త్వరలోనే బీజేపీలోకి వెళతారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన మాత్రం దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. ఆయనపై టీడీపీ కూడా దాదాపు ఆశలు వదులుకుందనే వార్తలు వినిపించాయి. ఓ వైపు టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో... మరోసారి గంటా శ్రీనివాసరావు అంశం తెరపైకి వచ్చింది. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే... గంటా కూడా ఇదే అదునుగా వైసీపీలోకి వస్తారేమో అనే చర్చ జరుగుతోంది.

అయితే పార్టీ మార్పు అంశంపై సెలెంట్‌గా ఉన్న గంటా శ్రీనివాసరావు తీరు చూస్తుంటే... ఆయన ఇప్పుడప్పుడే పార్టీ మార్పు అంశంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. త్వరలోనే ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... ఈ సమావేశాల నాటికైనా పార్టీ మారే అంశంపై గంటా ఓ నిర్ణయం తీసుకుంటారేమో అని విశాఖ రాజకీయవర్గాలు భావించాయి.

ఆయన దాదాపుగా బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే టాక్ వినిపిస్తున్నా... చివరి నిమిషంలో ఆయన వైసీపీ గూటికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. విశాఖపై గురి పెట్టిన సీఎం జగన్... అక్కడ బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న గంటాను పార్టీలోకి తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గంటా శ్రీనివాసరావు పార్టీ అంశంపై కొనసాగుతున్న సస్పెన్స్ మరికొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>