హైకోర్టు మెట్లు ఎక్కిన వల్లభనేని వంశీ...

సోషల్ మీడియాలో తన మీద చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యల మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని వంశీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

news18-telugu
Updated: November 12, 2019, 10:28 PM IST
హైకోర్టు మెట్లు ఎక్కిన వల్లభనేని వంశీ...
వల్లభనేని వంశీ మోహన్(File)
  • Share this:
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని హైకోర్టును ఆశ్రయించారు. తన మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారని, దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. గన్నవరం పోలీసులు తన ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంశీ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. విచారణ సందర్భంగా, కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలంటూ వంశీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వల్లభనేని వంశీ మోహన్ పార్టీ వీడతారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కూడా సమావేశం అయ్యారు. అసలు రాజకీయాల నుంచే తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. దీంతో పెద్ద దుమారం రేగింది. అయితే, వైసీపీ మీద పోరాటంలో అండగా ఉంటామని చంద్రబాబు స్పందించారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ రాజకీయంగా యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 12, 2019, 10:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading