Home /News /politics /

GANGULA KAMALAKAR SILENT AFTER CM KCR SUGGESTION AND REDUCE SENSATIONAL COMMENTS AGAINST BANDI SANJAY SU KNR

TRS: మంత్రి గంగుల కమలాకర్ మౌనంగా ఉండటానికి సీఎం కేసీఆర్ కారణమా..? హరీష్ రావు రంగంలోకి దిగడంతో..

సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ (ఫైల్ ఫొటోలు)

సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ (ఫైల్ ఫొటోలు)

కరీంనగర్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు ఉన్న గంగుల కమలాకర్ గత కొన్ని నెలలుగా సైలెంట్‌గా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుపడే ఇప్పుడు మౌనంగా ఉండటంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    ఒకప్పుడు గంగుల, బండి మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గుమనేది.. ఇద్దరు నేతల మధ్య మాటలు యుద్ధం నడిచేది. కానీ ఉన్నటుండి.గంగుల సైలెంట్ అవడం..రాజకీయకీయలలో మాత్రం పెద్ద దుమారం లేపుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణంగానే గంగుల సైలెంట్ అయ్యారని రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే గత కొద్దిరోజుల క్రితం గంగుల కమలాకర్‌ను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించి గట్టిగానే క్లాస్ ఇచ్చారని చర్చ.. తెలంగాణా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మాటలకు రెస్పాండ్ కావద్దని. తనను మనమే హైలెట్ చేస్తున్నామని చిన్న చిన్న కామెంట్స్ కు రెస్పాండ్ అయి మన స్థాయి ని తగ్గించుకోవద్దని గంగుల కు సీఎం సూచించినట్టుగా తెలుస్తోంది. ఏదయినా ఉంటే తానే చూసుకుంటా అనడంతో గంగుల గత 6 నెలల నుంచి బండి సంజయ్‌పై ఒక్కసారి కూడా కామెంట్స్ చేయలేదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

    ఇక, దుబ్బాక ఉప ఎన్నిక నుంచి బండి సంజయ్ వర్సెస్ మంత్రి హరీష్ రావు‌గా సీన్ మారిపోయింది. వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దుబ్బాక ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చాలా నిధులు ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదన్న బండి మాటలకూ.. హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీ కనుక నిధులు ఇచ్చినట్లైతే దుబ్బాక పాత బస్టాండ్ లో ముక్కు భూమికి రాయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. మరి అందుకు బండి సంజయ్ సిద్డంగా ఉన్నాడా? అంటూ ప్రశ్నించడం అప్పుడు సంచలనంగా మారింది.

    అప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో టీఆర్ఎస్ - బీజేపీ మధ్య ప్రచ్చన్న యుద్ధం నడుస్తోంది . బీజేపీ నేతలు ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు . ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తర్వాత మంత్రి హరీష్ రావు దూకుడు పెంచారు . దేశభక్తి సరే .. స్వరాష్ట్రంపై మీ భక్తి ఏదీ ? అంటూ బండి సంజయ్‌ను ప్రశ్నించారు. హరీష్ వ్యాఖ్యలకు సంజయ్ కౌంటరిచ్చారు. ఇలా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు . తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమ సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీష్ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదంటూ ఎద్దేవా చేశారు. అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదనే దానిపై సీబీఐ విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు . శ్రీకాంతాచారికి దొరికిన అగ్గిపెట్టె..హరీష్ రావుకు దొరకదా..? అని ప్రశ్నించారు. హరీష్ అంటేనే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని విమర్శించారు. దుబ్బాకలో అబద్దాలు మాట్లాడినందుకే హరీష్ వీపు సాఫ్ అయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో లేని వ్యక్తి గురించి విమర్శలు చేయకూడదని సీనియర్ నాయకుడిగా చెప్పుకునే హరీష్ రావుకు తెలియదా ? .. అంటూ ప్రశ్నించారు..

    సంజయ్ - హరీష్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో..తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి . సాగర్ ఉపఎన్నిక వేళ వీరి మధ్య మాటల తూటాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. మున్ముందు ఇంకెలాంటి కౌంటర్లు ఎదురౌతాయోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు .హరీష్ రావు కౌంటర్ వెనుకాల సీఎం కేసీఆర్ ఉన్నాడని బండికి గట్టిగ కౌంటర్ ఇచ్చేది ఒక హరీష్ రావు మాత్రమే అని టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

    -(పి శ్రీనివాస్, కరీంనగర్ కరస్పాండెంట్, న్యూస్ 18)
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: CM KCR, Gangula kamalakar, Harish Rao

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు