Home /News /politics /

నాపై బండి సంజయ్ కుట్ర.. : మంత్రి గంగుల సంచలన ఆరోపణలు

నాపై బండి సంజయ్ కుట్ర.. : మంత్రి గంగుల సంచలన ఆరోపణలు

బండి సంజయ్,గంగుల కమలాకర్ (File Photo)

బండి సంజయ్,గంగుల కమలాకర్ (File Photo)

ఎన్నికల అధికారిగా రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న కలెక్టర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించారు. తన ఎన్నికల ఖర్చును ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ ఎక్కువ చేసి సంజయ్‌కి ఇచ్చారని ఆరోపించారు.

    కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎంపీ బండి సంజయ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించి ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికల ఖర్చు వివరాలకు సంబంధించి సంజయ్ కలెక్టర్‌తో మాట్లాడినట్టుగా ఆడియోలో గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌, ఎంపీ బండి సంజయ్‌ కలిసి తన ఓటమికి కుట్ర పన్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు కూడా ఆ ఆడియోను పంపించినట్టు చెప్పారు.ఎన్నికల అధికారిగా రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న కలెక్టర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించారు. తన ఎన్నికల ఖర్చును ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ ఎక్కువ చేసి సంజయ్‌కి ఇచ్చారని ఆరోపించారు.

    కాగా,ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్ ఖర్చు చేశారని ఆరోపిస్తూ ఆయనపై అనర్హత వేటు వేయాలని బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే సంజయ్ కలెక్టర్ అహ్మద్‌తో మాట్లాడారని.. ఇద్దరు కలిసి తనపై అనర్హత వేటుకు కుట్ర చేశారని గంగుల ఆరోపిస్తున్నారు. గంగుల ఎన్నికల ఖర్చు వివరాలను కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సంజయ్‌కి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. గంగుల ఆరోపణలపై బండి సంజయ్ ఇంతవరకు స్పందించలేదు.
    First published:

    Tags: Bandi sanjay, Gangula kamalakar, Karimangar, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు