మోదీని మురికి కాలువతో పోల్చిన కాంగ్రెస్ ఎంపీ...సభలో దుమారం

బీజేపీ నేతలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అధిర్. 2జీ స్కామ్ జరిగితే సోనియా, రాహుల్ ఎందుకు జైల్లో లేరని బీజేపీపై సెటైర్లు వేశారు. ప్రధాని మోదీని పొగడడం తప్ప బీజేపీ నేతలకు ఏదీ చేతకాదని మండిపడ్డారు.

news18-telugu
Updated: June 24, 2019, 5:52 PM IST
మోదీని మురికి కాలువతో పోల్చిన కాంగ్రెస్ ఎంపీ...సభలో దుమారం
అధిర్ రంజన్ చౌదరి, ప్రధాని మోదీ
news18-telugu
Updated: June 24, 2019, 5:52 PM IST
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్థం జరుగుతోంది. ఈ క్రమంలో మోదీపై కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని మురికి కాల్వతో పోల్చడంతో లోక్సభలో దుమారం రేగింది. ఇందిరా గాంధీని గంగానదితో పోల్చిన ఆయన..మోదీ మురికి కాల్వంటూ వ్యాఖ్యానించారు. అధిర్ తీరుపై బీజేపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రధాని పదవిలో పదవిలో ఉన్న వ్యక్తిని అవమానిస్తారా? అని విరుచుకుపడ్డారు.

అధిర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ఆయన వెనక్కి తగ్గారు. తన ప్రసంగంలో ఎక్కడా 'నాలి' (కాల్వ) అనే పదాన్ని వాడలేదని అధిర్ వివరణ ఇచ్చారు. తనకు హిందీ మాట్లాడడం అంత బాగా రాదని తెలిపారు.

నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. నాలి అనే పదాన్ని ఎక్కడా వాడలేదు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యల వల్ల ప్రధానికి ఇబ్బంది కలిగి ఉంటే క్షమాపణలు చెబుతున్నా. నా హిందీ అంత బాగోదు.
అధిర్ రంజన్ చౌదరి


అంతకుముందు మోదీని సేల్స్‌మ్యాన్‌తో పోల్చారు అధిర్. ప్రధాని గొప్ప సేల్స్‌మ్యాన్ అని..ఆయన ముందు తాము ఉత్పత్తులను విక్రయించలేకపోయామని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ ప్రసంగంపై సోమవారం లోక్‌సభలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు అధిర్.మన ప్రధాన మంత్రి గొప్ప సేల్స్‌మ్యాన్. ఆయన ముందు మేం వస్తువులను విక్రయించలేకపోయాం. అందుకే బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ ఓడిపోయింది. వస్తువులను అమ్ముకోవడంలో కాంగ్రెస్ విఫలమయింది. బీజేపీ విజయవంతమైంది.
అధిర్ రంజన్ చౌదరి


అటు బీజేపీ నేతలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అధిర్. 2జీ స్కామ్ జరిగితే సోనియా, రాహుల్ ఎందుకు జైల్లో లేరని బీజేపీపై సెటైర్లు వేశారు. ప్రధాని మోదీని పొగడడం తప్ప బీజేపీ నేతలకు ఏదీ చేతకాదని మండిపడ్డారు. ప్రసంగంలో ఆయన పలుమార్లు తీవ్రపదజాలం వాడడంతో స్పీకర్ ఓంబిర్లా.. అడ్డుకున్నారు.

First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...