గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలా? జగన్‌పై చంద్రబాబు ఫైర్

టీడీపీ హయాంలో 2003లోనే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశామని చెప్పారు. జగన్ ఏదో కొత్తగా చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు మాజీ సీఎం.

news18-telugu
Updated: October 2, 2019, 3:52 PM IST
గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలా? జగన్‌పై చంద్రబాబు ఫైర్
చంద్రబాబు, వైఎస్ జగన్
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ జయంతి రోజుల అన్ని ప్రాంతాల్లో మద్యం షాపులను మూసివేస్తారని.. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు విభిన్నంగా ఉందని మండిపడ్డారు. గాంధీ జయంతి రోజునే మద్యం షాపులను నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. చట్టాలను చుట్టాలుగా మార్చుకొని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని జగన్‌పై ధ్వజమెత్తారు చంద్రబాబు. ఏపీ జగన్ జాగీరు కాదని వ్యాఖ్యానించారు.

ఇక ఏపీలో గ్రామ సచివాలయాల ఏర్పాటుపైనా చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ హయాంలో 2003లోనే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశామని చెప్పారు. జగన్ ఏదో కొత్తగా చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు మాజీ సీఎం. దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి వ్యవస్థ లేనట్లుగా జగన్ చెప్పడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. జగన్ బాబాయ్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో..ఇప్పటి వరకు తేల్చలేదని విమర్శలు గుప్పించారు చంద్రబాబు.

First published: October 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>