గోళ్లతో రక్కి లాఠీతో బెదిరించారు.. ఎంపీ గల్లా సంచలన ఆరోపణలు

శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. పోలీసులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని.. చొక్కా చింపి గోళ్లతో రక్కారని ఆరోపించారు గల్లా.


Updated: January 21, 2020, 3:56 PM IST
గోళ్లతో రక్కి లాఠీతో బెదిరించారు.. ఎంపీ గల్లా సంచలన ఆరోపణలు
గల్లా జయదేవ్ చొక్కా చించేసిన పోలీసులు
  • Share this:
ఏపీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో అరెస్టైన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ జైలు నుంచి విడుదలయ్యారు. మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం మధ్యాహ్నం జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసులపై ఎంపీ గల్లా జయదేవ్ సంచలన ఆరోపణలు చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. పోలీసులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని.. చొక్కా చింపి గోళ్లతో రక్కారని ఆరోపించారు గల్లా. ఎస్పీ లాఠీ పట్టుకొని బెదిరించారని.. వాళ్లు కొడతారేమోనని భయపడ్డానని చెప్పారు గల్లా జయదేవ్. 15 గంటల పాటు తిప్పారని.. వైద్యం కావాలని అడిగినా వినిపించుకోలేదని మండిపడ్డారు గల్లా.


నాకు 149 సెక్షన్ నోటీసు ఇవ్వ లేదు. నా ఇంటికి కూడా నోటీసులు ఇవ్వలేదు. నిరసన చేసుకునే హక్కు ఉంది. మేము అంత శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అడ్డుకున్నారు. లాఠీ ఛార్జ్ చేస్తే తుళ్లూరు మహిళలు నన్ను కాపాడారు.పోలీసులు నా చొక్కా చింపి గోళ్లతో రక్కారు. ఎస్పీ విజయరామారావు చేతిలో లాఠీ ఉంది. ఆయన నన్ను కొడతారు అని భయపడ్డాను. వైద్య సదుపాయం కావాలని కోరినా పట్టించుకోలేదు. ఫోటోలు కూడా తీసుకొనివ్వ లేదు. నా సెల్ ఫోన్ లాక్కున్నారు. పోలీసు జీపు లోనే వైద్య పరీక్షలు చేసి...జైలుకి పంపారు.
ఎంపీ గల్లా జయదేవ్


పోలీసులు గిచ్చుతున్నారంటే ఏంటో అనుకున్నానని....ఇప్పుడు బాగా తెలిసిందని చెప్పారు. ఒక ఎంపీకే ఇలా జరిగితే సామన్యుడి పరిస్థితి ఏంటని ఏపీ ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు గుప్పించారు గల్లా జయదేవ్.
Published by: Shiva Kumar Addula
First published: January 21, 2020, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading