గుంటూరు టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ... చంద్రబాబుకు తలనొప్పి

గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు గల్లా జయదేవ్, ఎమ్మెల్సీ, మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: July 11, 2019, 7:44 PM IST
గుంటూరు టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ... చంద్రబాబుకు తలనొప్పి
చంద్రబాబునాయుడు
news18-telugu
Updated: July 11, 2019, 7:44 PM IST
ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత పార్టీని ఏ రకంగా గాడిన పెట్టాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా పాలుపోవడం లేదు ఓ వైపు టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ వలసలను ప్రొత్సహిస్తుండటంతో... వారి రాజకీయ దాడిని తప్పించుకుంటూ పార్టీని కాపాడుకోవడంపై చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించారు. అయితే ఈ క్రమంలో చంద్రబాబుకు సహకరించాల్సిన పార్టీ ముఖ్యనేతలు కొందరు ఆయనకు లేని కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. నియోజకవర్గ స్థాయి పంచాయతీలను తన వరకు తీసుకొస్తుండటంతో... వారిని ఏ రకంగా సముదాయించాలో చంద్రబాబుకు కూడా అర్థంకావడం లేదని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు గల్లా జయదేవ్, ఎమ్మెల్సీ, మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్... ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాత్రం తన విజయానికి సహకరించలేదని డొక్కా ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో పర్యటించిన గల్లా జయదేవ్ తల్లి, మాజీమంత్రి అరుణ కుమారి సైతం ఇదే రకంగా వ్యవహరించారన్నది డొక్కా వర్గీయుల ఆరోపణ. ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేసుకోండి కానీ... ఎంపీ ఓటు మాత్రం టీడీపీకే వేయాలని ఆమె ఓటర్లను కోరినట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన డొక్కా... ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలతో అధినేతకు ఈ అంశంపై ఫిర్యాదు చేయించారని తెలుస్తోంది. మరోవైపు డొక్కానే తమకు సహకరించలేదంటూ గల్లా ఫ్యామిలీ సైతం పోటీగా కొందరు నేతలతో ఆయనపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయించారని సమాచారం. దీంతో గుంటూరు జిల్లాలో గల్లా వర్సెస్ డొక్కా మధ్య తలెత్తిన విభేదాలకు ఏ రకంగా ఫుల్ స్టాప్ పెట్టాలనే విషయం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారిందని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...