గవర్నమెంట్ జాబ్‌కు అప్లై చేసిన గద్దర్.. 73 ఏళ్ల వయసులో..

దయచేసి అందరూ తన కోసం కృషిచేసి ఉద్యోగం ఇప్పించాలని గద్దర్ విజ్ఞప్తి చేశారు. 73 ఏళ్ల వయసులో ఆడి, పాడకపోయినా కళాకారుల వద్ద డప్పులు మోస్తానని స్సష్టం చేశారు.

news18-telugu
Updated: December 4, 2019, 3:01 PM IST
గవర్నమెంట్ జాబ్‌కు అప్లై చేసిన గద్దర్.. 73 ఏళ్ల వయసులో..
ప్రజా గాయకుడు గద్దర్(File)
  • Share this:
ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. 73 ఏళ్ల వయసులో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడి ఉద్యోగానికి ఆయన అప్లై చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని సాంస్కృతిక సారథి కార్యాలయానికి వెళ్లిన గద్దర్.. నియామక కమిటీ సభ్యుడు శివ కుమార్​ను కలిసి దరఖాస్తును అందజేశారు. తాను ఉద్యోగానికి దరఖాస్తు చేసిన మాట నిజమేనని.. ఐతే టెంపరరీ ఉద్యోగం మాత్రమే కోరానని ఆయన తెలిపారు. పాటకు, కళకు, అక్షరానికి.. వయసు, కులం, ప్రాంతంతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు గద్దర్. తాను కోరుకున్నది కళాకారుని ఉద్యోగమేనని.. ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తానని చెప్పారు.

దాదాపు అయిదు వేల మంది కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నేను ఒకడిని. నేనూ పాడగలను. దరఖాస్తు చేసుకోవటంలో తప్పేముంది? నేనూ బతకాలి కదా. అందుకే దరఖాస్తు చేసుకున్నా. అందరు కళాకారులతో కలిసి రోజుకు ఎనిమిది గంటలు ప్రజల్లో తిరుగుతా. 73 ఏళ్ల వయసులో ఆడి, పాడకపోయినా కళాకారుల వద్ద డప్పులు మోస్తా.
గద్దర్


కాగా, సాంస్కృతిక కళా సారధిలో ఉద్యోగాల కోసం దరఖాస్తుకు గడువు ముగిసింది. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన వారందరికీ నవంబరు 25 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఐతే గద్దర్ గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు ఇచ్చారని రిక్రూట్‌మెంట్ కమిటీ మెంబర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గద్దర్ దరఖాస్తుపై తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే ఆయన.. సాంస్కృతిక కళా సారధిలో చేరి సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తానని అనడం హాట్‌ టాపిక్‌గా మారింది.
First published: December 4, 2019, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading