Home /News /politics /

G SRIKANTH REDDY APPOINTED AS AP STATE CHIEF WHIP

AP Chief Whip Srikanth Reddy: ఏపీ ప్రభుత్వ చీఫ్‌విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి

వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి (File)

వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి (File)

కడప జిల్లా రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీకాంత్ రెడ్డిని సీఎం జగన్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరో ఐదుగురికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి నియమితులయ్యారు. కడప జిల్లా రాయచోటి నుంచి శ్రీకాంత్ రెడ్డి ప్రాతినిధ్యంవహిస్తున్నారు. మంత్రివర్గంలో శ్రీకాంత్ రెడ్డి చోటు ఆశించినా...సామాజిక సమీకరణల కారణంగా కేబినెట్‌లో చోటు కల్పించలేకపోయారు.

    అలాగే విప్‌లుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, పార్థసారథి, కొరుముట్ల శ్రీనివాస్‌లను జగన్ నియమించారు. వీరు కూడా మంత్రి పదవి ఆశించినవారే. సామాజిక వర్గం పరంగా లెక్కలేసిన వైఎస్ జగన్ ఈ ఐదుగురికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. దీంతో విప్‌లుగా ఈ ఐదుగురు కీలకనేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉంటే ఈ ఐదుగురు కూడా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
    First published:

    Tags: AP Chief Whip Srikanth Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు