దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్రమ వలసదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అసోం తరహాలో అక్రమ వలసదారులను దేశం బయటకు విసిరేస్తామని చెప్పారు. ఆదివారం 'విజయ్ సంకల్ప్ సమ్మేళన్'లో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని కూడా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని తెలిపారు.
బీజేపీ వ్యవస్థాపకులైన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రాణ త్యాగం చేసిన గడ్డ ఎప్పటికీ మనదే అని అమిత్ షా నొక్కి చెప్పారు.పుల్వామా ఘటనలో అమరులైన 40మంది జవాన్ల త్యాగం వృథాగా పోదని, ఉగ్రవాదానికి మోదీ గట్టి సమాధానం చెప్పి తీరుతారని అన్నారు.కాగా, కశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ 1953 మే 11న శ్యాంప్రసాద్ ముఖర్జీ కశ్మీర్‌లో నిరసనకు బయలుదేరారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు ఆయన్ను అదుపులోకి తీసుకుని శ్రీనగర్ జైలుకు తరలించారు. అలా పోలీసుల అదుపులో ఉన్నప్పుడే జూన్, 1953లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, Jammu and Kashmir, Kashmir, Kashmir security