HOME »NEWS »POLITICS »from big boss to lok sabha polls self proclaimed godman swami om to contest from new delhi sk

లోక్‌సభ ఎన్నికల బరిలో బిగ్‌బాస్ కంటెస్టెంట్...కేజ్రీవాల్‌పై కోపంతోనే..

లోక్‌సభ ఎన్నికల బరిలో బిగ్‌బాస్ కంటెస్టెంట్...కేజ్రీవాల్‌పై కోపంతోనే..
స్వామి ఓం

పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఈ స్వయం ప్రకటిత స్వామీజీపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఓ మహిళలపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో మహిళపై ఆయన దాడిచేశారు. లైవ్‌లోనే చెంపచెల్లుమనిపించడం అప్పట్లో సంచలనం రేపింది.

 • Share this:
  దేశంలో ఎన్నికల రాజకీయాలు ఊపందుకున్నాయి. తొలిదశ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచారంలో బిజీగా ఉన్నారు నేతలు. సాధారణ రాజకీయ నేతలతో పాటు పాటు సినీ తారలు, క్రీడా ప్రముఖులు ఈసారి భారీగా రంగంలోకి దిగుతున్నారు. ఓ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సైతం ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. స్వయం ప్రకటిత స్వామీజీ, హిందీ బిగ్‌బాస్ టీవీ షో కంటెస్టెంట్ స్వామి ఓం లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. న్యూఢిల్లీ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో దిగుతున్నట్లు వెల్లడించారు.

  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీరుపై స్వామి ఓం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని..అందుకే తాను పోటీచేస్తున్నట్లు తెలిపారు. కాగా, హిందూమత చిహ్నం స్వస్తిక్‌ను ఆమాద్మీ ఎన్నికల గుర్తు చీపురు తరముతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను కొన్నిరోజుల క్రితం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దానిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేజ్రీవాల్‌ ట్వీట్‌పై మండిపడిన స్వామి ఓం..తాను న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 23న హిందూ సంఘాలు సమావేశమై.. తనను ఎన్నికల బరిలోకి దింపాలని నిర్ణయించాయని ఆయన తెలిపారు.  పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఈ స్వయం ప్రకటిత స్వామీజీపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఓ మహిళలపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో మహిళపై ఆయన దాడిచేశారు. లైవ్‌లోనే చెంపచెల్లుమనిపించడం అప్పట్లో సంచలనం రేపింది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో వార్తల్లో ఉన్న ఆయన బిగ్‌బాస్‌-10 టీవీ షోలో అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు ఏకంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. కాగా, న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పోటీచేస్తున్న విషయం తెలిసిందే.

  First published:March 25, 2019, 16:44 IST

  टॉप स्टोरीज