హోమ్ /వార్తలు /రాజకీయం /

వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై ఆగ్రహంతో సెల్ టవర్ ఎక్కిన యువకులు...

వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై ఆగ్రహంతో సెల్ టవర్ ఎక్కిన యువకులు...

ఎమ్మెల్యే శ్రీదేవి (File)

ఎమ్మెల్యే శ్రీదేవి (File)

తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నరసరావుపేట నియోజకవర్గానికి వెళ్లి అక్కడ మూడు రాజధానులు చేయాలని ప్రచారం చేస్తున్నారని, ఈ విషయం తెలిసి ఆందోళనతో యువకులు సెల్ టవర్ ఎక్కారని చెబుతున్నారు.

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ స్థానిక రైతులు చేస్తున్న పోరాటం మరింత ఉధృత రూపం దాల్చింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ నలుగురు యువకులు తుళ్లూరులోని సెల్ టవర్ ఎక్కారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించకపోతే తాము అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వచ్చే వరకు తాము సెల్ టవర్ దిగబోమని ప్రకటించారు.

13 జిల్లాల వారు బాగుండాలనే ఉద్దేశంతో మేం భూములు ఇచ్చాం. మిగిలిన రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకున్నాం. ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు. జగన్‌కు చేతకాకపోతే ఆయన్ను దీన్ని అలాగే వదిలిపెట్టమనండి. మేమే అమరావతిని నిర్మిస్తాం. జగన్‌, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు అందరికీ ఆఫీసులు, క్వార్టర్స్ కట్టిస్తాం. వారికి దండం పెడుతున్నాం. రాజధాని రైతులకు అన్యాయం చేయొద్దు. రాజధాని రైతులకు అండగా ఉంటామని చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు నోరెత్తడం లేదు. పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు మాతోనే ఉన్నారు. రేపు కూడా అలాగే ఉండాలి. పవన్ కళ్యాణ్ రైతుల తరఫున మాట్లాడాలి. మాకు ఏ కులం, పార్టీలు లేవు. పార్టీలతో మాకు సంబంధం లేదు. లోకల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా మాకు అండగా ఉండాలి. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు. రైతుల ఉసురు ఊరికేపోదు. నీకు దండం పెడతా శ్రీదేవి తల్లీ. ఒక్కసారి మా దగ్గరికి వచ్చి మాట్లాడమ్మా. మీరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాం.’ అని సెల్ టవర్ మీద నుంచి ఓ రైతు ఏబీఎన్ న్యూస్ కు ఇచ్చిన ఫోన్ కాల్‌లో తెలిపారు.

యువకులు సెల్ టవర్ ఎక్కిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బ్రహ్మయ్య, మరో ముగ్గురు యువకులు సెల్ టవర్ ఎక్కారు. వారిని కిందకు దిగి రావాలని పోలీసులు కోరారు. తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నరసరావుపేట నియోజకవర్గానికి వెళ్లి అక్కడ మూడు రాజధానులు చేయాలని ప్రచారం చేస్తున్నారని, ఈ విషయం తెలిసి ఆందోళనతో యువకులు సెల్ టవర్ ఎక్కారని చెబుతున్నారు. రైతుల తరఫున పోరాడాల్సిన వారు ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 12 మంది రైతులు అమరావతిలో ఆందోళనతో చనిపోయారని, ఇంకా మరెందరి ప్రాణాలు పోవాలని ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Amaravati, Ap capital, Vundavalli sridevi, Ysrcp

ఉత్తమ కథలు