రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయండి.. వెంకయ్యకు నలుగురు ఎంపీల లేఖ

తామిద్దరం బీజేపీలో చేరుతున్నట్టు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ క్లారిటీ ఇచ్చారు.

news18-telugu
Updated: June 20, 2019, 6:25 PM IST
రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయండి.. వెంకయ్యకు నలుగురు ఎంపీల లేఖ
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి లేఖ అందజేసిన టీడీపీ ఎంపీలు (Image:ANI)
news18-telugu
Updated: June 20, 2019, 6:25 PM IST
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు తమను బీజేపీలో విలీనం చేయాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు.  ఆ లేఖపై సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్ సంతకాలు చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం తాము తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. తాము బీజేపీలో చేరుతున్నట్టు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ అధికారికంగా ధ్రువీకరించారు. మీడియా సమావేశంలో అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానని ప్రకటించారు. మరోవైపు తనకు బీజేపీతో అనుబంధం ఉందని, బీజేవైఎంలో పనిచేసినట్టు టీజీ వెంకటేష్ ప్రకటించారు. బీజేపీలో చేరుతున్నట్టు ధ్రువీకరించిన టీజీ వెంకటేష్.. అధికార పార్టీలో ఉంటే రాయలసీమ ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకురావడానికి అనువుగా ఉంటుందన్నారు. అలాగే, బీజేపీలో బలం పెరుగుతుందని చెప్పారు.

రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలంటూ టీడీపీ ఎంపీలు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అందించిన లేఖ


‘రాజ్యసభలో టీడీపీ పక్ష నేత సుజనా చౌదరి, ఉప నాయకుడు సీఎం రమేష్ సమక్షంలో టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దేశ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న  చర్యలతో స్ఫూర్తి పొంది తాము బీజేపీలో చేరాలని తీర్మానించాం.’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. వెంటనే తమను బీజేపీలో విలీనం చేయాల్సిందిగా కోరారు.

నలుగురు టీడీపీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చిన తర్వాత బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, రాజ్యసభాపక్ష నేత థావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి ఉప రాష్ట్రపతిని కలిశారు.

First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...