బీజేపీకి షాక్..కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్రమంత్రి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఆమాద్మీ చేతిలో ఓడిపోయారు. లోక్‌‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి ఆమె స్వస్తిచెప్పి సొంతగూటికి చేరారు.

news18-telugu
Updated: April 12, 2019, 4:22 PM IST
బీజేపీకి షాక్..కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్రమంత్రి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తొలి విడత ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 91 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఇక రెండో విడత ఎన్నికలు జరిగే లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీకి షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి క్రిష్ణ తీర్థ్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. నాలుగేళ్ల తర్వాత తిరిగి సొంత గూటికి చేరారు. ఐతే అనూహ్యంగా ఆమె పార్టీని వీడడంతో బీజేపీ శ్రేణులు జీర్ణించులేకపోతున్నాయి. ఢిల్లీలో బలమైన నేతగా పేరు క్రిష్ణ తీర్థ్ కాంగ్రెస్‌లో చేరడం బీజేపీకి ఇబ్బందికరమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు క్రిష్ణ తీర్థ్. అనంతరం మన్మోహన్ కేబినెట్‌లో స్త్రీ, శిశు సంక్షేమమంత్రిగా పనిచేశారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గానూ సేవలందించారు. ఐతే 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఆమాద్మీ చేతిలో ఓడిపోయారు. ఇక లోక్‌‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి ఆమె స్వస్తిచెప్పి సొంతగూటికి చేరారు.
First published: April 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading