ఛాతి నొప్పితో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాసేపటి క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అన్ని పరీక్షలు చేసి, చికిత్స అందించిన తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, ప్రస్తుతం నిలకడగా ఉన్నందున ఆయన్ను డిశ్చార్జి చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనా టెస్టు చేసినా ఆయనకు నెగటివ్‌గానే వచ్చిందని తెలిపాయి. కాగా, మన్మోహన్ సింగ్ హార్ట్ పేషంట్, మధుమేహం కూడా ఉంది. 2009లో ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన మందులు వాడుతూ వస్తున్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.