Home /News /politics /

FORMER POLICE AND TEENMAR MALLANNA KEY AID DASARI BHUMAIAH JOINS TRS AMID HUZURABAD BYPOLL MKS

Huzurabad bypoll:టీఆర్ఎస్‌కు కొత్త జోష్ -గులాబీ గూటికి దాసరి భూమయ్య -తీన్మార్ మల్లన్న టీమ్ ముక్కలు

టీఆర్ఎస్ లోకి దాసరి భూమయ్య

టీఆర్ఎస్ లోకి దాసరి భూమయ్య

dasari bhumaiah joins trs:ప్రతిష్టాత్మక హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరింది. ఉమ్మడి కరీంనగర్ సహా ఉత్తర తెలంగాణ అంతటా పాపులారిటీ కలిగిన మాజీ పోలీస్ అధికారి, తీన్మార్ మల్లన్న టీమ్ లో ముఖ్యుడు దాసరి భూమయ్య ఆదివారం నాడు అధికారికంగా గులాబీ గూటికి చేరారు.

ఇంకా చదవండి ...
ప్రతిష్టాత్మక హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరింది. ఉమ్మడి కరీంనగర్ సహా ఉత్తర తెలంగాణ అంతటా పాపులారిటీ కలిగిన మాజీ పోలీస్ అధికారి దాసరి భూమయ్య ఆదివారం నాడు అధికారికంగా గులాబీ గూటికి చేరారు. కేసీఆర్ సర్కారుకు కంట్లో నలుసుగా వ్యవహరించిన తీన్మార్ మల్లన్న తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న దరిమిలా ఆ టీమ్ లో ప్రముఖుడైన దాసరి భూమయ్య, మిగతా నేతలు తలోదారి చూసుకుంటున్నారు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ పోలీస్ అధికారి దాసరి భూమయ్య ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని సింగాపురంలో రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో భూమయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.

సంచలనాల పోలీసుగా పాపులరైన దాసరి భూమయ్య రెండేళ్ల కిందట పదవీ విరమణ పొంది కాంగ్రెస్ లో చేరినా, తర్వాతి కాలంలో బహుజన, దళితవాదానికి గొంతుగా నిలబడతానంటూ తీన్మార్ మల్లన్న సైన్యంలో కలిసిపోయారు. అయితే, ఇటీవల కాలంలో కేసులపాలైన తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో భూమయ్య సైతం సొంత నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్ఎస్ లో చేరిక సందర్బంగా ఈటల, తీన్మార్ మల్లన్నలను ఉద్దేశించి దాస‌రి భూమయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం విడ్డూరంగా ఉందని, అయన చెప్పుకునే భావజాలానికి, బీజేపీ పార్టీకి సంబంధమే లేదని దాస‌రి ఎద్దేవా చేశారు. బీజేపీ నిరుద్యోగాన్ని పెంచుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని, బడా కార్పొరేట్ల చేతిలో దేశాన్ని పెడుతోందని ఆరోపించారు. బీజేపీ భావజాలం నచ్చదు కనుకే తీన్మార్ టీమ్ నుంచి బయటికొచ్చినట్లు భూమయ్య తెలిపారు. ఆయనతోపాటు తీన్మార్ టీమ్ లోని మరో 100 మంది సభ్యులు కూడా ఇవాళ టీఆర్ఎస్ లో చేరిపోయారు. కాగా,

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దాసరి భూమయ్య చేరిక ద్వారా టీఆర్ఎస్ పార్టీకి మరింత ఊపు లభించినట్లయింది. తీన్మార్ మల్లన్న టీమ్ లో నంబర్ 2గా కొనసాగిన భూమయ్య స్థానికుడు కావడం గమనార్హం. హుజూరాబాద్, జమ్మికుంటలో అన్ని వర్గాల వారికి ఆప్తుడిగా భూమయ్యకు పేరుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యమకారుడైన గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌ను గెలిపించాలని భూమయ్య పిలుపునిచ్చారు. గతంలో చిలుక ప్రవీణ్ లాంటి సహచరుల తిరుగుబాటు, ఇప్పుడు దాసరి భూమయ్య లాంటి పెద్దలు దూరం కావడంతో తీన్మార్ మల్లన్న టీమ్ ముక్కలయినట్లేనని కామెంట్లు వస్తున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Etela rajender, Harish Rao, Huzurabad, Huzurabad By-election 2021, Teenmar mallanna, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు