అయ్యో రామ...నన్నెవరు గుర్తుపెట్టుకుంటారు: దేవెగౌడ

అసోంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన దేశంలో అతిపెద్ద రైల్ బ్రిడ్జిని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించగా...ఈ ప్రాజెక్టుకు 1999లో నాటి దేశ ప్రధాని దేవెగౌడ శంకుస్థాపన చేశారు.

news18-telugu
Updated: December 26, 2018, 8:07 AM IST
అయ్యో రామ...నన్నెవరు గుర్తుపెట్టుకుంటారు: దేవెగౌడ
మాజీ ప్రధాని దేవెగౌడ (ఫైల్ ఫోటో)
  • Share this:
దేశంలో అతిపెద్ద రైల్ రోడ్డు బ్రిడ్జి ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో మంగళవారం ప్రారంభించడం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడం పట్ల జేడీఎస్ అధినేత,  మాజీ ప్రధాని దేవెగౌడ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘అయ్యో రామ...నన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటారు?’అని ఆయన వ్యాఖ్యానించారు. దేవెగౌడ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు 1999లో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తాను ఈ రైల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అంశాన్ని అందరూ మర్చిపోయారని, ఏవో పత్రికలు ప్రస్తావించి ఉండవచ్చని అన్నారు.

బ్రహ్మపుత్ర నదిపై బొగిబీల్ వద్ద రూ.5,900 కోట్ల వ్యయంతో 4.9 కి.మీ రైల్ రోడ్డు బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.

కశ్మీర్‌కు రైల్వే లైన్, డిల్లీ మెట్రో, బొగిబీల్ రైల్ బ్రిడ్జి తదితర ప్రాజెక్టులకు ప్రధానిగా ఉన్నప్పుడు నేనే అనుమతి మంజూరు చేశాను. వీటికి శంకుస్థాపన చేసి, ఒక్కో ప్రాజెక్టుకు రూ.100 కోట్లు నిధులు కూడా కేటాయించాను. అయితే ఇప్పుడు ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోయారు.
దేవెగౌడ, మాజీ ప్రధాని


బాంబే కర్ణాటక రీజియన్‌కు తాను ప్రధానిగా ఉన్న కాలంలో ఏమీ చేయలేదన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి వెళ్లి తాను చేసిన అభివృద్ధిని చూడాలని దేవెగౌడ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి
Published by: Janardhan V
First published: December 26, 2018, 8:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading