రాజ్యసభకు మాజీ ప్రధాని దేవెగౌడ పోటీ..

మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ రాజ్యసభకు పోటీచేయనున్నారు. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

news18-telugu
Updated: June 8, 2020, 12:32 PM IST
రాజ్యసభకు మాజీ ప్రధాని దేవెగౌడ పోటీ..
మాజీ ప్రధాని దేవెగౌడ (ఫైల్ ఫోటో)
  • Share this:
(డీపీ సతీష్-న్యూస్18 సౌత్ హెడ్)
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ రాజ్యసభకు పోటీచేయనున్నారు. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన అధికార ప్రకటన విడుదల చేశారు. కర్ణాటకలో జేడీఎస్‌కు ప్రస్తుతం 38 స్థానాలే ఉన్నాయి. దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే మరో 16 స్థానాలు అవసరం. అయితే.. కాంగ్రెస్‌కు కర్ణాటకలో 68 స్థానాల బలం ఉన్న నేపథ్యంలో మిగులు ఓట్లను జేడీఎస్‌కు సర్దుబాటు చేసి దేవెగౌడ ఎన్నికకు మార్గం సుగమం చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ తరఫున మల్లికార్జున్ ఖర్గేను కూడా పెద్దల సభకు పంపనన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజ్యసభ ద్వారా పార్లమెంటులోకి రావడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే, పార్టీ ఎమ్మెల్యేల జోక్యం, సోనియా మాటతో ఆయన రాజ్యసభలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. మొత్తం 16 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన దేవెగౌడ.. ఏడుసార్లు అసెంబ్లీకి, 6 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూడు సార్లు మాత్రమే ఓడిపోయారు.

దేవెగౌడ గెలిస్తే పెద్దల సభకు వెళ్తున్న రెండో మాజీ ప్రధాని అవుతారాయన. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పెద్దల సభలోనే ఉన్నారు. ఇదిలా ఉండగా, దేవెగౌడ అభ్యర్థిత్వానికి సిద్ధరామయ్య వర్గం మద్దతు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కూలిపోయాక.. సిద్ధరామయ్యపై జేడీఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పడిపోవడానికి ఆయనే కారణమని ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.
First published: June 8, 2020, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading